పుట:Jyothishya shastramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యలూ బ్రహ్మనాడియందే గలవు. ఉదాహరణకు బయట విద్యను నేర్వని చిన్న వయస్సువారు కూడా, ఎంతో విద్యా ప్రావీణ్యులుగ కనిపించుచున్నారు. వారియందే విద్య ఉన్నదానివలన, అది లోపలే ప్రాప్తించిన దానివలన, వారు ఆ విద్యలో ప్రావీణ్యులుగ కనిపించుచున్నారు.

బయట కనిపించు సమస్తము మన బ్రహ్మనాడియందు ఉండడమే కాక, ఈ సమస్తమును సృష్ఠించిన దేవుడు కూడ మనయందే ఉన్నాడు. మనిషి బయట ఎక్కడ వెదకిన దేవుడు కనిపించడు. బయట కనిపించని దేవుణ్ణి కూడ మనిషి తన శరీరము లోపలే తెలియవచ్చును, పొందవచ్చును. చివరికి మోక్షమును పొందవలసినది కూడ శరీరములోనే. ప్రకృతిని సృష్ఠించిన దేవుడే శరీరములో ఉంటే, మిగత వాటిని గురించి బయట వెదకవలసిన పనిలేదు. పూర్వము మహర్షులు, బయటి పరిశోధన లేకుండగనే సూర్య,చంద్ర,నక్షత్ర గతులనూ, గ్రహణములనూ చెప్పగలిగారని మరువకూడదు. నేటి శాస్త్రపరిశోధకులు చెప్పని విషయములను ముందే ఏ పరిశోధన లేకుండ చెప్పిన ఘనత ఇందూదేశ జ్ఞానులకు గలదు. గతములో మేము చెప్పిన ‘‘జనన మరణ సిద్ధాంతము’’గానీ, ‘‘ఆధ్యాత్మిక రహస్యములు’’గానీ అంతరంగ పరిశోధనలోనివేనని తెల్పుచున్నాము. ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు చెప్పిన 12 గ్రహముల వివరమని తెలియవలెను. చీకటి గ్రహమైన మిత్ర గ్రహముగానీ, అదృశ్య రూపముగా నుండి, కొన్ని క్షణములు మాత్రము కనిపించు చిత్రగ్రహము గానీ ఇప్పటికీ క్రొత్తవే. అయినా వీటి పాత్ర జ్యోతిష్యములో చాలా ఉన్నది. వీటి పాత్రను వదలివేసిన నేటి జ్యోతిష్యములో శాస్త్రీయత లోపించినదనియే చెప్పవచ్చును. జ్యోతిష్యము శాస్త్రముగా నిరూపించబడాలంటే గ్రహముల సంఖ్య 12 గానే ఉండాలి.