పుట:Jyothishya shastramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్న విద్యను శోధించి తెలుసుకొనుచున్నవాడు విద్యార్థి అవుతాడు. పూర్తి విద్యను నేర్చినవాడు విద్యావేత్త అవుతాడు. విద్యార్థిని, విద్యావేత్తయని అనలేము. అలాగే ఉన్న శాస్త్రమును శోధించి తెలుసుకొనువాడు శాస్త్ర పరిశోధకుడవుతాడు, శాస్త్రవేత్తగాడు! మరియు శాస్త్రజ్ఞుడూగాడు. మా దృష్టిలో ఖగోళశాస్త్రపరిశోధకులున్నారు గానీ, ఖగోళశాస్త్రజ్ఞులు లేరు. పూర్తి శాస్త్రమును తెలియనంతవరకు, ఎవరూ శాస్త్రజ్ఞులు కాలేరు. నేడు ఖగోళమును పరిశోధించు శోధకులున్నారు గానీ, పూర్తి తెలిసిన శాస్త్రవేత్తలు లేరు. అందువలన భవిష్యత్తులో ఇంతవరకు చెప్పని రెండు గ్రహముల వివరమును ఎవరైనా చెప్పవచ్చునేమో అన్నాము. మిత్ర, చిత్ర అను రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్నపని అని కూడా అన్నాము. అలా అనుటకు కారణము ఏమనగా! మిత్ర గ్రహము చీకటితో కూడుకొన్నది. దాని మీదికి ఏ వెలుగూ ప్రసరించదు. ఏ వెలుగూ దాని మీద ప్రతిబింబించదు. ఏ రేడియేషన్‌ కిరణములు దానిని తాకలేవు. ఇకపోతే రెండవ గ్రహమైన ‘చిత్రగ్రహము’ అనేక రంగులు కలదై, 24 గంటలలో కొన్ని నిమిషములు మాత్రమే గోచరించును. మిగతా సమయములో అదృశ్యమై ఉండును. కొన్ని నిమిషములు మాత్రమే అగుపించు అదృశ్యగ్రహమును చిత్రగ్రహము అంటాము. కావున కనిపించని చిత్ర గ్రహమును గానీ, చీకటి గ్రహమైన మిత్ర గ్రహమునుగానీ కనుగొనుట కష్టమన్నాము. మీరు ఏ పరిశోధన ద్వారా చెప్పుచున్నారని నన్నడిగితే, నా జవాబు ఏమనగా! నా పరిశోధన ఏదైనా బయటగానీ, బయటి పరికరముల ద్వారాగానీ ఏమాత్రముండదు. నా శోధనయంతా శరీరాంతరములోనే ఉండును. శరీరములోని బ్రహ్మనాడిలో సమస్త విశ్వము ఇమిడియున్నది. శరీరాంతర బ్రహ్మనాడిలోనే షట్‌ శాస్త్రములు ఇమిడియున్నవి. సకల