పుట:Jyothishya shastramu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ॥ ఈయన యొక్క విశిష్ఠత పూర్తి ప్రపంచమునకే తెలియును. ఈయన ప్రపంచములో ఒక క్రొత్త సమాజమునే తయారుచేసి అది శాశ్వతముగా ఉండునట్లు చేశాడు. అందువలన ముహమ్మద్‌ప్రవక్తగారి పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. మీరు ఎందుకు ప్రవక్తగారి జాతకమును చూపి అడుగుచున్నారో మీరు చెప్పకున్నా నాకు అర్థమైనది. మీ ఉద్దేశ్యములో జ్యోతిష్యము హిందూమతస్థులకు తప్ప ఇతర మతముల వారికి వర్తించదను భావము కలదు. అందువలన మేము ఏమి చెప్పుదుమో నని అడుగు చున్నారు. సరే మీలాంటి భావమే ఇతరులకు కూడా ఎంతో మందికి ఉండవచ్చును. మీ అనుమానము ఎవరికీ లేకుండుటకు మీమాట కు ఏమి చెప్పుచున్నామనగా! ప్రపంచములో మతము అనునది మనుషులు పెట్టుకొన్నదేగానీ, దేవుడు పెట్టినదికాదు. దేవుని దృష్ఠిలో మనుషులంతా సమానమే! అందువలన జ్ఞానముతో చూస్తే, జ్ఞానము వలన పుట్టుకొచ్చిన జ్యోతిశాస్త్రమైన జ్యోతిష్య శాస్త్రము ప్రపంచములో అన్ని మతముల వారికీ, అన్ని సమాజముల వారికీ సమానముగా వర్తించును. ప్రపంచములో పుట్టిన ప్రతి జీవరాశీ, ప్రతి మనిషీ గ్రహచారము ప్రకారమే కదలించబడు