పుట:Jyothishya shastramu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నారు. ఆడిరచబడుచున్నారు. అందువలన జ్యోతిష్యము ఒక్క హిందువు లకే అనుకోవడము పొరపాటు.

ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తాము. మీరు ఈ జాతకములోని విశిష్ఠతను గురించి అడిగారు. ప్రపంచములో ఎవరికి ఏది విశేషముగాయున్నా, జ్ఞానుల దృష్ఠిలో దేవుని జ్ఞానమే విశేషముగా యుండును. అందువలన ప్రవక్తగారి జాతకములోనున్న ముఖ్య సారాంశ మైన దానిని గురించి చెప్పుకొందాము. మనిషి కొన్నాళ్ళు బ్రతికి భౌతికముగా చనిపోయినా, అతనిని చాలాకాలము మనుషుల మధ్య బ్రతికింపజేయునది అతని కీర్తి ప్రతిష్ఠలని చెప్పవచ్చును. ఒక్క దైవజ్ఞానము తప్ప ప్రతిదీ జాతకములో ఉండును. కీర్తి ప్రతిష్ఠలు ఎవరి జాతకములోనైనా పదవ స్థానమున ఉండును. 14 వందల సంవత్సరముల పూర్వము చనిపోయిన ముహమ్మద్‌ ప్రవక్తగారు నేటికినీ మనుషుల మధ్య జ్ఞాపకముగా ఉన్నాడను టకు కారణము అతని జీవితములో అతడు సాధించుకొన్న కీర్తియేనని చెప్పవచ్చును. అతని కీర్తి ఎటువంటిదని చూచిన అది పదవ స్థానమున ఉండుననుకొన్నాము కదా!

ప్రవక్తగారి జాతకమున పదవస్థానములో ఏమి కలదో ఇప్పుడు గమనిద్దాము. ప్రవక్తగారి జాతకములో పదవస్థానము వృశ్చికలగ్నము అగుచున్నది. పదవ స్థానమున ప్రవక్తగారి జనన సమయమునకు శని, కేతు గ్రహములు రెండు గలవు. ఈ రెండు గ్రహములు చాలామందికి తెలిసినవే. జ్యోతిష్యులైనవారందరికీ సుపరిచయ గ్రహములే. అయితే అదే దశమ స్థానమున మిత్ర గ్రహము మరొకటి కలదు. మిత్రగ్రహము ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియని మిత్రగ్రహము పూర్తి చీకటి గ్రహము.