పుట:Jyothishya shastramu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమును కుజుడు తాకినాడు

2) ఆయుష్షుకు అధిపతిjైున శనిని కుజుడు తాకుచున్నాడు.

రాజీవ్‌గాంధీగారి జననములో కూడా మహాత్మాగాంధీగారి జననము లో ఉన్నట్లే గలదు. ఆయుస్థానమును కుజుడు ముట్టుకోవడమూ, ఆయువుకు అధిపతియైన శనిని శత్రువైన కుజుడు చూడడమూ కలదు.

ఈ మూడు జాతకములలోనూ ఆయుస్థానమును రక్తపిపాసియైన కుజగ్రహమే తన చేయినుంచి చూడడము విశేషము. రెండవ సూత్రములో మూడు జాతకములలోనూ ఆయుష్షునిచ్చు శనిని గాంధీగారి జాతకములో గురువుచూడగా, మిగతా రాజీవ్‌, జగన్‌ జాతకములలో కుజుడే తాకినాడు.

1) ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమును కుజగ్రహము తాకినది

2) ఆయుష్షుకు అధిపతియైన శనిని కుజుడు తాకుచున్నాడు.

గాంధీ, రాజీవ్‌గాంధీగారి ఇద్దరి జాతకములు ఆయుష్షు విషయము లో ఒకే విధముగాయున్నవి. అందువలన ఈ ముగ్గురి మరణములు ఒకే విధముగా జరిగాయి.