పుట:Jyothishya shastramu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నావద్దయున్నవన్నీ సిద్ధాంతబద్దమైనవి, సూత్రబద్దమైనవి కావున మేము సులభముగా చెప్పగలము. అదే ప్రశ్ననే మరియొకమారు చిన్నచిన్న ప్రశ్నలుగా అడుగు.

22) ఒకే సమయములో, ఒకే విధ కర్మలేనివారికి, వేరువేరు కర్మలున్న వారికి ఒకే ప్రమాదము జరుగగలదా?

జ॥ ఇప్పుడు నాది జవాబు కాదు ప్రశ్న. ఒకే కర్మయనిగానీ, వేరువేరు కర్మలనిగానీ అనుటకు కర్మలేమైనా కనిపిస్తాయా? కనిపించని దానిని మీరు ఎలా నిర్ధారణ చేసి చెప్పుచున్నారు? ఇది నా తరపున ప్రశ్న అయినా దీనికి మీరు జవాబు చెప్పలేరు. ఎందుకనగా కర్మలు ఎవరికీ కనిపించవు. కనిపించని కర్మలను గురించి అపోహపడే దానికంటే కర్మలను మించినది, కర్మలను చూడగల్గునది మరొకటి గలదు. అదియే దేవునిజ్ఞానము. దేవుని జ్ఞానము కల్గి చూడగల్గితే వారు అందరూ అలా చనిపోవడానికి కారణము తెలియగలదు. మేము చెప్పినదానినే అందరూ నమ్మాలి అని నేను చెప్పడము లేదు. ఎందుకనగా మేము చెప్పేమాట అందరికీ అర్థము కాకపోవచ్చును. అర్థము కాకపోయినప్పుడు నమ్ముటకు అవకాశము ఉండదు. అందువలన నేను చెప్పునది అందరికీ జవాబు కాదు. అర్థముకాగల కొందరికి మాత్రమే జవాబని తెలియాలి. నాకు తెలిసినంతవరకు దేవునికి తెలియకుండ ఏమీ జరుగదు. దేవుడు అన్నిటికీ సాక్షి అనికూడ మరువకూడదు. బస్సులో చనిపోయినవారందరూ తమ మరణమును ఊహించుకొని ఉండరు. వారి కర్మప్రకారము వివిధ పనుల నిమిత్తము బయలుదేరిన వారికి కర్మలన్నీ ఒకే విధముగా కూడా లేవు. వాస్తవముగా వారి కర్మప్రకారము వారు హైదరాబాద్‌ పోయి వివిధ పనులలో లగ్నము కావలసియున్నది. వాస్తవముగా మీరు అనుకొన్నట్లే ఆ సమయమునకు చనిపోవునట్లు ఎవరి