పుట:Jyothishya shastramu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మాలేదు. అయినా చనిపోయారు. కర్మ మినహా జరుగదని కర్మ సిద్ధాంతమున్నప్పుడు వారి కర్మప్రకారము వారు హైదరాబాద్‌ పోకుండ మధ్యలో చనిపోవడమేమిటని మాకు కూడా ప్రశ్న వచ్చినది. శాస్త్రము శాసనముగా జరిగితీరును. కర్మసిద్ధాంతము ప్రకారము కర్మవేరుగా యున్నప్పుడు, జరగరానిది ఎలా జరిగిందను ప్రశ్న ఎవరికైనా రాక తప్పదు. ఒక సంఘటన జరిగిందంటే అది సత్యమే. జరిగినది సత్యమే అయినప్పుడు దానిని శాస్త్రము అంటాము. ఎందుకనగా శాస్త్రము అనగా సత్యము అనియు, సత్యము అనగా శాస్త్రము అనియు సూత్రము గలదు. శాస్త్రము ప్రకారము వారి పనులు హైదరాబాద్‌లో జరుగవలసియుండగా దానిని కాదని మధ్యలో ప్రమాదము జరిగినది. జరిగినది ప్రత్యక్ష సత్యము కావున అదియూ శాస్త్రము ప్రకారమే జరిగిందంటే ఇక్కడ శాస్త్రము అనునది పరస్పర విరుద్దమగును. బాగా యోచిస్తే శాస్త్రము ఎప్పటికీ పరస్పర విరుద్దముగా ఉండదు. ఇక్కడేదో చిక్కు ముడిపడినదని అర్థమగుచున్నది. మనకు అర్థముకాని చిక్కుముడిని విప్పుకొని చూస్తే ఒక విషయము అర్థమగు చున్నది. ప్రపంచ కర్మల రికార్డును మార్చివేయునది ఒకే ఒక్కటి గలదు. అదియే దైవజ్ఞానము. దైవజ్ఞానము ప్రపంచ కర్మను అతిక్రమించగలదు గానీ, ప్రపంచ కర్మ దైవజ్ఞానమును ఏమీ చేయలేదు. ఎవరైతే దైవజ్ఞాన దూషణకు పాల్పడినారో వారందరినీ జ్ఞానము గుర్తించుకొని సమయమును చూచి ఒకచోట చేర్చి అందరినీ వారి కర్మలకు అతీతముగా కాల్చివేసినది. ఈ మాటను మేమంటే ఇదంతా కట్టుకథయని కొందరనవచ్చును. ఎవరు ఎలా అనుకొనినా ఫరవాలేదు. నాకు తెలిసిన సత్యమును నేను చెప్పాను. వారు ఎప్పుడు జ్ఞానమును దూషించారో మీరు చెప్పగలరా అని కొందరు, మా వాడు మంచివాడు దైవభక్తికలవాడు అటువంటివాడు దైవజ్ఞానమును