పుట:Jyothishya shastramu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుండలి అంటున్నాము. అంతేగానీ జన్మరాశికుండలి అని అనడములేదు. పంచాంగమును ఉపయోగించి వ్రాసుకొన్న లగ్న కుండలిలో గ్రహములు తెలియుచుండునుగానీ, కర్మ కనిపించడము లేదు. అయినా ప్రతి పనికీ కర్మే కారణమంటున్నాము, గ్రహమే కారణమనడములేదు. కర్మ ఉన్నది గానీ కనిపించడము లేదు. గ్రహములు మాత్రము కనిపిస్తున్నవి గ్రహములు ఉన్నది కాలచక్రములో, అయితే చక్రములోని గ్రహములు కనిపిస్తున్నవిగానీ, కాలము కనిపించడములేదు. కాలము క్రిందనున్న కర్మచక్రము కనిపించుచున్నదిగానీ అందులోని కర్మ కనిపించడము లేదు. క్రిందికి వస్తే గుణచక్రమూ కనిపించడము లేదు. అందులోని గుణములుగానీ, జీవుడుగానీ ఎవరికీ ఏమాత్రము కనిపించడము లేదు. పైనగల కాల చక్రములో చక్రమూ, చక్రములోని గ్రహములూ కనిపించగా, కాలము కనిపించడములేదు. క్రిందయున్న కర్మచక్రములో చక్రము మాత్రము కనిపించుచున్నదిగానీ, చక్రములోని కర్మ కనిపించడములేదు. ఇక ఇంకా క్రిందికిపోతే గుణచక్రమున్నది. అయితే అక్కడ చక్రమూ కనిపించడము లేదు. అందులోని గుణములూ కనిపించడములేదు. గుణములలోనున్న జీవుడూ కనిపించడము లేదు. మనము బాగా మనోదృష్ఠి పెట్టి ఆలోచించాలి. పైనగల కాలచక్రములో చక్రమూ గ్రహములు రెండూ కనిపించగా, దాని క్రిందగల కర్మచక్రములో చక్రము మాత్రము కనిపించగా, దానికంటే క్రింద గుణచక్రము, గుణములు, జీవుడులో ఏ ఒక్కటీ కనిపించలేదు. దీనినిబట్టి పైకి పోయేకొద్దీ దృష్ఠి పెరుగుతుందనీ, క్రిందికి వచ్చేకొద్దీ దృష్ఠి తరుగుతుందనీ అర్థమగుచున్నది. మీకు అర్థమైనా అర్థముకాకున్నా మేము చెప్పునదే మనగా, కాలమూ కనిపించదు, కర్మమూ కనిపించదు. కాలము కర్మ ఎవరి కోసమున్నాయో ఆ జీవుడూ అక్కడేయున్న గుణములూ ఏమాత్రము