పుట:Jyothishya shastramu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేధాశక్తితో ఏ సమస్యకైనా సులభముగా జవాబు చెప్పుచుందురు. కొందరు అందముగాయున్నా తెలివితక్కువవారుగా యుందురు. వారి ప్రవర్తన కూడా తెలివి తక్కువగానే కనిపించుచుండును. అలా ఉండుటకు కారణమేమి?

జ॥ కర్మచక్రములోని కర్మ రాశులున్న భాగములలో ఐదవ భాగము లేక ఐదవ స్థానమునందు మనిషి మేధస్సుకు సంబంధించిన కర్మలుండును. అలాగే కాలచక్రములోని పన్నెండు గ్రహములలో బుద్ధికి అధిపతియైనవాడు చంద్రుడు. జాతకచక్రములో చంద్రుడు ఐదవ స్థానములో ఉన్నా లేక చంద్రుని హస్తము అక్కడున్నా అటువంటి వ్యక్తులు మంచిబుద్ధిగలవారై ఉందురు. ఐదవ స్థానము కాకుండ మిగత పాపస్థానములైన 3,7,11 స్థానములలో ఉండినట్లయితే ఉన్న స్థానమునుబట్టి పూర్తి తెలివితక్కువగా యుండును. చంద్రునితోపాటు శత్రు గ్రహములు కలిసిన అక్కడ కలిసిన గ్రహములనుబట్టి తెలివితక్కువ తనముండును. చంద్రునితోపాటు బుధుడు శత్రువై కలిసియుండడము వలన వ్యాపారములో తెలివితక్కువగాయుండు నని తెలియవచ్చును. అట్లే ఆయా గ్రహములనుబట్టి చెప్పవచ్చును.

10) కొందరు కాలము కర్మ అనుచుందురు. మీరు కాలచక్రము, కర్మచక్రము అన్నారు. అవి కనిపిస్తాయా?

జ॥ ఏ మనిషికైనా ఏ కర్మయున్నదీ తెలుసుకొనుటకు వీలుపడదు. ఎందుకనగా జాతక చక్రములోనున్న గ్రహములను కాలచక్రములోని లగ్నములందున్నట్లు చెప్పుకొంటున్నాముగానీ, రాశులలోనని చెప్పలేదు. రాశులు కర్మచక్రములో, లగ్నములు కాలచక్రములో ఉంటాయి అని చెప్పుకొన్నాము. రాశియే కనిపించనప్పుడు దానిలోని కర్మ కూడా కనిపించదు కదా! జన్మకుండలిలో వ్రాసుకొను భాగములను జన్మలగ్న