పుట:Jyothishya shastramu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానిని గ్రహించి మనిషికి అందివ్వగల పనిని కూడా చేయుచున్నది. ఎనిమిదవ స్థానము ఆయుష్షుకు సంబంధించిన స్థానము అంటాము. ఆయుష్షుకు సంబంధించిన ఎనిమిదవ స్థానములో శత్రుగ్రహమైన కుజ గ్రహము ఉండడముగానీ, అక్కడ చేయిపెట్టి చూడడముగానీ ఉంటే ఆయుస్థానము బాగా లేదనియే చెప్పాలి. ఇటువంటి జాతకమునే ఒక దానిని క్రిందగల పటములో చూపుతాను చూడండి.

ఇప్పుడు మీరు చూసిన జాతకములో ఎనిమిదవ స్థానమునకు ఎదురుగానున్న రెండవ స్థానములో కుజగ్రహమున్నట్లు గుర్తించాము.

ఈ జాతకుని కుండలిలో అదే రెండవ స్థానమందే, అదే

కుజగ్రహమే ఉంచడమును మీరు చూడవచ్చును.