పుట:Jyothishya shastramu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేషమును 24 గంటలతో హెచ్చించి వచ్చిన సంఖ్యను నక్షత్ర పరిమాణముతో భాగించగా గతజన్మలో ఎన్ని గంటలు ఈ దశ అయిపోయినది తెలియ గలదు. అదే విధముగా నిమిషముల వరకు, చివరకు సెకండ్ల వరకు గత జన్మ భుక్తిని తెలియవచ్చును. కుజదశ మొత్తము ఏడు (7) సంవత్సరము లుండగా అందులో ఎన్ని సంవత్సరములు, ఎన్ని నెలలు, ఎన్ని దినములు, ఎన్ని నిమిషములు వెనుక జన్మలో కుజదశ అయిపోయినది తెలియగల్గి మిగిలిన కాలమును ప్రస్తుత జన్మలో అనుభవించవలసియున్నదని చెప్ప వచ్చును. ఈ విధముగా జాతకములో ముఖ్యమైన దశా కాలమును తెలియవచ్చును. ఇప్పుడు ఆ గణితమును గురించి కొంత తెలుసు కొందాము.