పుట:Jyothishya shastramu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెల, ఏ దినము, ఏ గంటలో చనిపోయాడో అదే దశలో అదే సంవత్సరము, అదే నెల, అదే దినము, అదే గంటలో అదే సమయమున జన్మించుచున్నాడని తెలియుచున్నది. గతజన్మ సత్యమని తెలిసినవానికి గతజన్మ దశాభుక్తి కూడా సత్యమని తెలియును. గతజన్మలో దశాభుక్తిని తెలియుటకు ప్రస్తుత జన్మలో ఏ దశలో ప్రారంభమగుచున్నదో తెలియాలి. అట్లు తెలియుటకు ప్రయత్నిద్దాము.

జగన్‌ అను వ్యక్తి జనన సమయములో చంద్రున్ని గురించి తెలుసు కొనుటకు వేసిన గణితములో చంద్రుడున్న ఆరుద్ర నక్షత్రము యొక్క పూర్తి పరిమాణమును గడియలలో 56-23గా ఉన్నట్లు తెలుసుకొన్నాము. అట్లే జనన సమయమునకు గడచిన ఆరుద్ర యొక్క పరిమాణము గడియలలో 16-57గా ఉన్నట్లు తెలుసుకొన్నాము. ఆరుద్ర నక్షత్రమునుబట్టి దశ విభజన నక్షత్రములలో ఆరుద్ర నక్షత్రము పూర్తి నాలుగు పాదములు కుజ దశను గుర్తు చేయుచున్నవి. అందువలన ఈ జాతకుడు కుజదశలో పుట్టాడు అని తెలిసిపోయినది. కుజదశలో జాతకుడు పుట్టినప్పుడు ఆ దశ ఎంతవరకు మిగిలియున్నది. ఎంతవరకు గతజన్మలో అయిపోయినది తెలియవలెను. అట్లు తెలియుటకు జనన సమయములో గడచిన ఆరుద్ర కాలమును కుజదశతో గుణించి వచ్చిన సంఖ్యను పూర్తి ఆరుద్ర పరిమాణము తో భాగించగా ఎన్ని సంవత్సరములు గతజన్మలో గడచినది తెలిసిపోవును. అట్లు భాగించినప్పుడు మిగిలిన శేషమును పన్నెండు నెలలతో హెచ్చించి నక్షత్ర పరిమాణముతో భాగించగా ఎన్ని నెలలు గత జన్మలో గడచిపోయినది తెలియును. అప్పుడు కూడా మిగిలిన శేషమును 30 దినముల చేత హెచ్చించి ఆరుద్ర నక్షత్ర పరిమాణముతో భాగించగా గతజన్మలో ఎన్ని దినములు గడచినది తెలియవచ్చును. అలాగే అప్పుడు కూడా మిగిలిన