పుట:Jyothishya shastramu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతకము అన్ని విధముల అర్థమగుటకు జాతకలగ్నమును గుర్తించుకొని చూచాము. జన్మలగ్న కుండలిలో గుర్తించుకోవలసినది ఏమీ లేదు. అందువలన గ్రహచారమునకు సంబంధించిన జనన లగ్నము పూర్తి తెలిసిపోయినది. గ్రహచారములో ఫలితములెట్లున్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అను విషయమును దశాచారమును గుర్తించిన తర్వాత చూస్తాము. ఇప్పుడు ఈ జాతకుని దశాచారమును ఎలా వ్రాసుకోవాలో తెలుసుకొందాము. జన్మదిన నక్షత్ర పరిమాణమును తెలుసుకొనుటకు ముందుదిన నక్షత్రమును ఆధారము చేసుకొని చూడవలెను. జాతకుడు పుట్టినది పౌర్ణమి బుధవారము రాత్రి 1-30 గంటలకు అయినందున, ఆ దినము మృగశిర రాత్రి 6-53 నిమిషములకే అయిపోయిన దానివలన, తర్వాత వెంటనే ఆరుద్ర నక్షత్రము ప్రారంభమై జాతకుడు పుట్టిన సమయములో ఆరుద్ర ఉండుట వలన ముందుదిన నక్షత్రము మృగశిర అగుచున్నది. ఆరుద్ర నక్షత్రము యొక్క పూర్తి కాలమును తెలియుటకు మృగశిరను ఎలా ఉపయోగించుకొంటున్నామో క్రింద చూడండి. ప్రతి నక్షత్రము యొక్క పూర్తి పరిమాణము 60.00 గడియలు. అయితే దానిలో కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగా తక్కువ గానీ నక్షత్రములు గడచుచుండును. పంచాంగములో తొమ్మిది గ్రహములలో ఎనిమిది గ్రహముల గమనములను, నక్షత్ర ప్రవేశములను వ్రాసియుందురు అయితే ఒక్క చంద్రున్ని గురించి వ్రాసియుండరు. పంచాంగము ప్రకారము ఏ గ్రహము ఎక్కడున్నది, ఏ లగ్నములో, ఏ నక్షత్రములోయున్నది తెలియవచ్చును. చంద్రుడు ఏ నక్షత్రములో ఉన్నదీ, ఏ లగ్నములో ఉన్నది తెలియాలంటే మనమే స్వయముగా గణితమును ఉపయోగించి తెలియవచ్చును. గణితమును ఎలా చేయాలో ప్రక్కపేజీలో వ్రాసి చూపిస్తాము దాని ప్రకారము ఎవరైనా చేసుకోవచ్చును.