పుట:Jyothishya shastramu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తము పన్నెండు గ్రహములలో నలుగురు పురుష గ్రహములూ, నలుగురు స్త్రీ గ్రహములూ, మిగత నలుగురు నపుంసక గ్రహములని తెలియ వలెను. ఉదాహరణకు శుక్రుడు ` స్త్రీ అని వ్రాసియుండుట వలన శుక్ర గ్రహము స్త్రీ జాతి గ్రహమేమో అనుకోకూడదు. భూమిమీద గల సమస్తమునకు పన్నెండు గ్రహములే అధిపతులని చెప్పుకొన్నాము కదా! దాని ప్రకారము భూమిమీదగల స్త్రీలకు, పురుషులకు, నపుంసకులకు గ్రహములు అధిపతులుగా ఉన్నారుగానీ, గ్రహములు స్త్రీలుగా, పురుషులుగా, నపుంసకులుగా లేరని గుర్తుంచుకోవలెను. ఇప్పుడు ఏ గ్రహము ఎవరికి కారకులో తెలుసుకొందాము.

ఈ విధముగ పన్నెండు గ్రహములు తల్లితండ్రిని మొదలుకొని జ్ఞానము అజ్ఞానము వరకు ముఖ్యమైన విషయముల మీద అధికారము