పుట:Jyothishya shastramu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడినుండి 4,7,8 స్థానములను చూచుట వలన ఆ జాతకునికి ఎరుపు రంగు గుడ్డల మీద ఆసక్తి ఉండునని కూడా చెప్పవచ్చును. ఇప్పుడు గ్రహముల ఆధీనములోనున్న రుచుల విషయమును గురించి తెలుసు కొందాము.

జాతకునికి అనుకూలమైన గ్రహములనుబట్టి ఆ గ్రహముల ఆధీనములోనున్న రుచుల మీద ఇష్టముండును. అందువలన కొందరు కొన్ని రుచులనే ఎక్కువగా ఇష్టపడుచుందురు. అంతేకాక శత్రు గ్రహముల రుచుల ఆహారముల వలన ఎప్పుడైనా అనారోగ్యము కల్గుటకు అవకాశము ఉండును. అట్లే అనుకూలమైన గ్రహముల ఆధీనములోని రుచుల ఆహారమువలన ఆరోగ్యముగా ఉండడము కూడా జరుగుచుండును. కొందరికి వారి శత్రుగ్రహముల రుచుల ఆహారము శరీరమునకు సరిపోదు (అలర్జీ అగును) అప్పుడు సరిపోని ఆహారములను వదలివేయడము మంచిది. అందువలన ఏ జాతకునికి ఏ రుచుల ఆహారము సరిపోవునో తెలుసు కోవడము మంచిది. ఇప్పుడు గ్రహముల లింగభేదమును గురించి తెలుసు కొందాము.