పుట:Jyothishya shastramu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్యోతిష్యములో ప్రశ్న వచ్చినప్పుడు నాల్గవ స్థానములో బుధగ్రహము శుభుడై (మిత్రుడై) యుంటే అతడు వ్యాపారము చేయుచున్నాడని లేక వ్యాపారములో రాణించగలడని చెప్పవచ్చును. ఈ విధముగా చిన్న ప్రశ్నలకు జవాబును ఇటువంటి సమాచారము ద్వారా సులభముగా చెప్పవచ్చును. అందువలన ఇప్పుడు పన్నెండు గ్రహములు ఏయే రంగులమీద అధికారము కల్గియున్నాయో చూచుకొందాము.

ఈ రంగులు తెలియడము వలన జాతకునికి అనుకూలమైన రంగుల గుడ్డలు మాత్రము అతనికి శుభమును (మంచిని) కలుగజేయుననీ, మిగతా రంగులు జాతకునికి వ్యతిరేఖ గ్రహములవైనందున ఆ రంగు గుడ్డలు ధరించితే, వాటివలన అశుభము (చెడు) జరుగునని తెలియ వచ్చును. అప్పుడు వారికి అనుకూలమైన గ్రహముల గుడ్డలనే ధరించుటకు అవకాశముండును. తమకు అనుకూలమైన గ్రహముల యొక్క రంగు వస్త్రముల మీద ఆ రంగుల అధిపతుల (గ్రహముల) కిరణములు ఎక్కువగా ప్రసరించును. అందువలన జాతకునకు గ్రహబలము గుడ్డల రంగుల వలన లభించవచ్చునని చెప్పవచ్చును. అందువలన పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న రంగులను తెలుసుకోవడము మంచిది. అంతేకాక కుజగ్రహము అనుకూలమైనదైయుండి జన్మలగ్నములలో ఉండుట వలన