పుట:Jyothishya shastramu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేతువు

కేతు గ్రహము అందరి దృష్ఠిలో చిన్నదైనా మా దృష్ఠిలో పెద్దదని చెప్పక తప్పదు. పన్నెండు గ్రహములలో పదకొండు మనిషిని పూర్తిగా అజ్ఞానములో ముంచి ప్రపంచ మార్గములో నడుపగా, ఒక్క కేతు గ్రహము మాత్రము మనిషికి దైవభక్తిని కల్గించి దైవమార్గములో నడుచుటకు అవకాశమేర్పరచుచున్నది. మనిషికున్న శ్రద్ధనుబట్టి తన ద్వారా మనిషికి నిరాకార భక్తి లభించునట్లు చేయుచున్నది. అందువలన ద్వాదశ గ్రహము లలో కేతువును ముఖ్యమైన గ్రహముగా మేము చెప్పుచున్నాము. అటువంటి కేతు గ్రహము యొక్క ఆధీనములో ఏమున్నవో ఇప్పుడు గమనిద్దాము. ఆత్మజ్ఞానములాంటి జ్ఞానము, సన్న్యాసత్వము, నిరాకార భక్తి, దైవభక్తి, ఆశ్రమ నివాసము. సన్న్యాసులతో స్నేహము, వేదాంతము, దేవుని ధ్యాస, చిత్రవర్ణము, దర్భమొక్కలు, ఉలవల ధాన్యము, తపస్సు, మౌనము, అపసవ్య లిపిని వ్రాయడము లేక అటువంటి దానిని చదవడము, వైరాగ్యము, శూద్రగోష్టి, మహమ్మదీయులు, హేతువాదము మొదలగునవన్నియు కేతువు ఆధీనములో ఉండును.

కేతు గ్రహము యొక్క కిరణములు కర్మచక్రములోని ఐదవ స్థానము మీద పడితే ఐదవ స్థానములోనున్న ప్రపంచ జ్ఞానమునుండి దేవుని జ్ఞానము వైపు మళ్ళించుటకు ప్రయత్నించును. అప్పుడు మనిషికి ప్రపంచ జ్ఞానము మీద శ్రద్ధయుంటే దానిప్రకారము ప్రపంచ జ్ఞానమునే కలుగజేస్తూ, ప్రపంచ జ్ఞానములో హేతువాదమును కల్గించి సత్యము కొరకు వెదుకుటకు ప్రయత్నించునట్లు చేయును. అలాంటి సత్యాన్వేషణలో దేవతలను నమ్మకుండ దేవునివైపు చూపు పారునట్లు చేయును. అలాంటప్పుడు మనిషికి కొద్దికొద్దిగా దేవునివైపు చింత కలుగును. ఒకవేళ ముందే దేవుని జ్ఞానము మీద మనిషికి శ్రద్ధయుంటే ప్రపంచ జ్ఞానమునకు వ్యతిరేఖముగా నడుచు