పుట:Jyothishya shastramu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనునట్లు మనిషిని ప్రేరేపించును. ప్రపంచ మార్గమునకు వ్యతిరేఖముగా నడిపించినప్పుడు అతడు ఎవరి ప్రమేయమూ లేకుండా ప్రపంచమునకు వ్యతిరేఖ మార్గమైన దేవుని మార్గమువైపు పోవునట్లు చేయును. అయినా దేవునివైపురాక దేవునివైపు అనునట్లు చేయును. ఒకవేళ కేతుగ్రహము వ్యతిరేఖుడై శత్రుపక్షమునవుంటే, మనిషిని ప్రపంచ జ్ఞానములోనే ఉండునట్లు చేయును. అటువంటి వారికి ఏమాత్రము దైవజ్ఞానము మీద ఆసక్తి యుండదు. అతనికి బలవంతముగా దైవజ్ఞానమును చెప్పినా అతను పట్టించుకోడు. ఈ విధముగా కేతు గ్రహము యొక్క ఐదవ రాశిలోని ఫలితముండగా మిగతా రాశుల ఫలితములు వేరుగా ఉండును.

భూమి

ఇంతవరకు భూమిని గ్రహ కూటమిలోనికి ఎవరూ చేర్చకున్నా, మేము మాత్రము ఇక్కడినుండి చెప్పవలసివచ్చినది. కర్మను పాలించుటలో భూమికూడా పాత్ర వహించుచున్నది. కావున భూమిని గ్రహకూటమిలో చేర్చి చెప్పడమైనది. భూమి ఆధీనములో కొన్ని విషయములు మాత్రము కలవు. వాటిలో గనులు, ఖనిజములు ముఖ్యమైనవి. ఇళ్ళ స్థలములు, గుహలు, మంచు ప్రదేశములు, హిమపాతము, అరికాళ్ళు, అరి చేతులు నవ్వలురావడము, అరికాళ్ళు అరిచేతులు చీలడము, చర్మరోగములు, సువాసనలు, సుగంధ ద్రవ్యములు, మొలలు మొదలగునవి భూమి ఆధీనములోగలవు.

మిత్ర

మిత్రగ్రహము చీకటి గ్రహము. అందువలన మిత్ర ఆధీనములో నిద్ర, నిద్రలోని కదలికలు ఉండును. మిత్ర చీకటి గ్రహమైనందున