పుట:Jyothishya shastramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమస్తము పన్నెండు భాగములుగా విభజింపబడి పన్నెండు సముదాయము లుగా ఏర్పడినవి. అలా ఏర్పడిన వాటిలో ఒక్కొక్క సముదాయము ఒక్కొక్క గ్రహము యొక్క ఆధీనములో చేరిపోయి, అవన్నియు ఆ గ్రహము యొక్క సొంత ఆస్థులుగాయున్నవి. అందువలన కాలచక్రములోని గ్రహముల వద్ద ఏమీ లేకున్నా, భూమిమీద గల సమస్తము మీద అధికారము కలవిగా యున్నవి. ఏ గ్రహము భూమిమీదగల ఏ వస్తువుల మీద మరియు ఏ పదార్థము మీద అధికారము కలదో కొంతవరకు తెలుసుకొందాము. మొదట సూర్య గ్రహము యొక్క ఆధీనములో ఏమున్నవో తెలుసుకొందాము.

సూర్యుడు

పిత, ఆత్మ, తనువు, రాజ్యము, ప్రభావము, ధైర్యము, అధికారము, నేత్రము, పిత్తము, శూరత్వము, శక్తి, విదేశ పర్యటన, జ్ఞాన తేజము, పరాక్రమము, ఉష్ణము, అగ్ని, ధర్మ ధ్యాస, కడుపు, కన్ను, పాలనాశక్తి, ప్రభుత్వ భూములు, కోర్టు వ్యవహారములు, బంజరు భూములు, గుండ్రని ఆకారముండు పొలములు, రారాజు యోచన, గ్రామ ఆధీన జాగాలు, ఎర్రచందనము, ముద్రాధికారము, తెల్ల జిల్లేడు, తూర్పు, ఆంగ్ల విద్య, ఆదివారము, చైత్రమాసము, రాజభవనములు, వేడిని పుట్టించు నీలి వెలుగులు, పై అంతస్థులు గల భవనములు ఈ విధముగా సూర్యుని ఆధీనములో ఉన్నవి. ఇట్లుండుట వలన సూర్యుడు కర్మచక్రములోని నాల్గవ రాశిమీద తన కిరణములను ప్రసరించినప్పుడు ఆ జాతకునికి పై అంతస్థు భవనములు కట్టించు ప్రేరణ చేయును. ఒకవేళ వ్యక్తి పేదవాడైవుంటే, భవనము కట్టించు స్థోమతలేనివాడైయుంటే, అతనికి పెద్ద భవనములో కిరాయికైనా ఉండుటకు ప్రేరణ చేయును. కిరాయికి కూడా ఉండలేని