పుట:Jyothishya shastramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక మనిషి జనన కాలము ఏ లగ్నములో జరిగినా ఆ లగ్నమును బట్టి పన్నెండు గ్రహములలో ఆరు మిత్రులుగా, ఆరు శత్రువులుగా ఉందురని తెలుసుకొన్నాము. మిత్రులనగా పుణ్యమును ఇచ్చి సుఖ పెట్టువారు. శత్రువులనగా పాపమును అమలు చేసి కష్టపెట్టువారు అని అర్థము. జనన కాల లగ్నమునుబట్టి మిత్రులుగా మరియు శత్రువులుగా యున్న గ్రహములనే దశాచారములో కూడా, మిత్ర శత్రువులుగా లెక్కించు కోవలెను. 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ అష్టమి మంగళవారము జన్మించిన రంగయ్య అను వ్యక్తి యొక్క జనన నక్షత్రమునుబట్టి పుట్టుకలోనే అతనిది బుధదశ అని తెలిసిపోయినది. ఇప్పుడు రంగయ్యకు ఏ దశ మంచిదో, ఏ దశ మంచిది కాదో తెలుసుకొందాము. జనన సమయములో నున్న లగ్నము మీనలగ్నమగుట వలన మీన లగ్నమునకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో వారే దశలలోను మిత్ర శత్రువులుగా చెప్పబడుదురు. దాని ప్రకారము మీన లగ్నమునకు మిత్రులు శత్రువులు క్రింది విధముగా కలరు.

రంగయ్య అను వ్యక్తికి జాతకరీత్యా గురు, కుజ, చంద్ర, సూర్య, భూమి, కేతువు అను ఆరు గ్రహములు అనుకూలురుగా, మిగత బుధ,