పుట:Jyothishya shastramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9 పరమాత్మకు గుర్తని ఇంతకు ముందు "సృష్ఠికర్త కోడ్‌" అను గ్రంథములో వ్రాశాము. జ్యోతిష్యశాస్త్రములో 1,2,3 సంఖ్యలలో 3ను దేవునిగా గుర్తించాము. గణితశాస్త్రములో అన్ని అంకెలలోకెల్ల పెద్దదయిన 9 సంఖ్యను దేవునిగా చెప్పడము జరిగినది. ఇప్పుడు మనము జ్యోతిష్యమును చెప్పు చున్నాము కాబట్టి ఈ శాస్త్రము ప్రకారము 3 సంఖ్యను ముఖ్యముగా తీసుకొంటున్నాము. మూడు సంఖ్యలలో 1) అశ్వని 2) భరణి 3) కృత్తిక గా ఉన్నాయి. ఈ మూడిరటిని గణితములో పెద్దదయిన దేవునికి గుర్తుగా యున్న 9 చేత హెచ్చించవలసియున్నది. అప్పుడు 3×9=27 అగును. 27 సంఖ్యలో జీవాత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా, ఆత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా, పరమాత్మకు సంబంధించినవి కొన్ని నక్షత్రములుగా ఏర్పరచబడియున్నవి. 27 నక్షత్రములను ఎలా విభజించారో ఇప్పుడు తెలుసుకొందాము.