పుట:Jyothishya shastramu.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ విధముగా నక్షత్రములు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు భాగములుగా విభజింపబడ్డాయి. ఒక లగ్నమునకు 2¼ నక్షత్రమును కేటాయించినట్లు ఇక్కడ అదే విధముగా 2¼ లగ్నము అనగా 9 నక్షత్ర పాదములను ఒక్కొక్క గ్రహమునకు కేటాయించి ఆ గ్రహము పేరుతోనే కొన్ని దశా సంవత్సరములను నిర్ణయించడము జరిగినది. దైవ జ్ఞానుల కొరకు జ్యోతిష్యములో దశాసంవత్సరములను ఏర్పరచడము జరిగినది. అజ్ఞానులకొరకు 12 లగ్నములను తయారు చేసి ఒక్కొక్క లగ్నమునకు 2¼ నక్షత్రమును (9 నక్షత్రపాదములను) నిర్ణయించినట్లు, జ్ఞానులకొరకు 12 దశలను గ్రహముల పేరుతో తయారు చేసి, ఆ గ్రహము పేరుతోనున్న దశలకు మొత్తము 120 సంవత్సరములను నిర్ణయించడము జరిగినది. జ్యోతిష్యగ్రంథమును చూస్తే పన్నెండు లగ్నములు, పన్నెండు గ్రహములు, పన్నెండు దశలు, పన్నెండు పదుల (120) సంవత్సరములు కనిపించు చున్నవి.

38. మంచి దశలు - చెడు దశలు

గ్రహచారమును చూచుటకు పన్నెండు లగ్నములను చూచినట్లు దశా చారమును చూచుటకు లగ్నములనూ, వాటిలోని నక్షత్రములనూ చూడవలసి యుండును. పుట్టిన సమయమునుబట్టి జాతక లగ్నమును తెలుసుకొన్నట్లు దశలను తెలియుట కొరకు కూడా పుట్టిన సమయమునుబట్టి తెలియవలసిన అవసరమున్నది. పుట్టిన సమయములో గల నక్షత్రమునుబట్టి చంద్రుడు ఎన్నో లగ్నములోయున్నాడో, ఎన్నో నక్షత్ర పాదములోయున్నాడో తెలిసినట్లు ఒక మనిషి దశలను తెలియుటకు కూడా పుట్టిన సమయమును అనుసరించి ఆ దినము జరుగుచున్న నక్షత్రమునుబట్టి దశలను తెలియ వచ్చును. జనన