పుట:Jyothishya shastramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొడుగు అని అర్థము. ఇంకా వివరముగా చెప్పుకొంటే క్షేత్రమునకు నీడ నిచ్చునది క్షత్రీయనిగానీ, క్షత్రము అనిగానీ చెప్పవచ్చును. గొడుగులేని దానిని, ఏ నీడనూ ఇవ్వని బయలును నక్షత్రము అంటాము.

ఆకాశములో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు మూడు మాత్రమే కనిపిస్తుంటాయి. వెలుగును కల్గి సూర్య, చంద్ర, నక్షత్రములు మూడు కనిపించడము వలన కొంత వివరము కలదు. సూర్యుడు, చంద్రుడు ఇరువురు ఒకే గ్రహకుటుంబములోని వారే, కనిపించు నక్షత్రము మాత్రము గ్రహ కుటుంబములోనిది కాదు. ఎవరి ఆధిపత్యములేని వాడు దేవుడు. అలాగే ఎవరి క్షత్రము క్రింద, ఎవరి క్షత్రము ఆధీనములో లేనిది నక్షత్రము. నక్షత్రము అనుపేరునుబట్టి దానిని దేవునికి ప్రతిగా (ప్రతిరూపముగా) చెప్పు కోవచ్చును. బయట కనిపించు సూర్య చంద్రగ్రహములకు ఆధారము, నిర్మాత దేవుడు అన్నట్లు సూర్య చంద్రులు లేని అమావాస్యరోజు కూడా నక్షత్రములు కనిపిస్తుంటాయి. సూర్య చంద్రులు లేకుండా పోయినప్పుడు కూడా నక్షత్రముండుట వలన నక్షత్రము శాశ్వతమైన దేవునికి ప్రతి రూపముగా చెప్పుకొంటున్నాము. మనిషి తలలో కాలచక్రమందు కనిపించ కుండ ఇమిడియున్న సూర్య చంద్ర మొదలగు గ్రహకుటుంబమునకు అంతటికి నక్షత్రము ఆధారముగాయున్నది. కావున నక్షత్ర ఆధారముతోనే గ్రహచారమును తెలియవచ్చును. నక్షత్ర ఆధారము మీదనే గ్రహములు ప్రయాణించుచున్నవి. పంచాంగములో కూడా మధ్యలో నక్షత్రముండి ఇటు తిథి, వారమునకు అటు యోగ, కరణములకు కేంద్రముగా ఆధారమై ఉన్నది. జ్యోతిష్యములో ఎంతో ప్రాముఖ్యముగలది నక్షత్రము. బయట ప్రపంచములో సూర్య చంద్రులు వెలిగే గ్రహములుగా కనిపించినా అలాగే గ్రహము అను పేరు లేకుండా నక్షత్రము కనిపించినా సూర్య చంద్రులున్నట్లు