పుట:Jyothishya shastramu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనిషి పుట్టిన సమయమునుబట్టి జాతకము నిర్ణయించబడుచున్నది. పుట్టిన సమయములో కర్మచక్రము మీద సూర్యుని కిరణములు ఎచట ఉండునో, దానినిబట్టి గ్రహచారము నిర్ణయించబడును. అలాగే చంద్రుడు కాలచక్రములో ఏ నక్షత్రములో ఉన్నాడో, దానినిబట్టి దశాచారము నిర్ణయించబడును. కాలచక్రములోని రాజు అయిన సూర్యునితోనూ, మంత్రి అయిన చంద్రునితోను నిర్ణయించబడు గ్రహచార, దశాచారముల వలన మనిషి జీవితము ఎలా సాగునో తెలియగలదు. మనిషి జాతకములో గ్రహచారము కాళ్ళకు చెప్పులులాగా ఉండగా, దశాచారము తలకు గొడుగు లాగున్నదని తెలియవలెను. మనిషి జాతకము లేక జాఫతకము అను దానిలో ప్రారబ్ధకర్మనుబట్టియున్న గ్రహచారమూ, దశాచారమును ఎలా తెలియవచ్చునో ఉదాహరణగా ఒక మనిషి పుట్టుకను తీసుకొని చూస్తాము.

రంగయ్య అనునతడు 2009 సంవత్సరములో ఫిబ్రవరి నెలయందు 17వ తేదీన మంగళవారము ఉదయము 9 గంటలకు జన్మించాడు. ఆ దినము పంచాంగము ప్రకారము మంగళవారము, అష్టమి తిధి సా॥ గం॥ 4-13 నిమిషములు గడియలలో 24-16 వరకు గలదు. నక్షత్రము అనూరాధ గం॥ 3-45 నిమిషములు గడియలలో 53-14 వరకు కలదు. లగ్న విషయము కుంభములో భుక్తి గం॥ 0-18 నిమిషములు కలదు. రంగయ్య అష్టమి రోజు అనూరాధ నక్షత్రమున మంగళవారము పగలు ఉదయము 9 గంటలకు జన్మించాడు. అతడు జన్మించిన సమయములోనే సంచితము నుండి జీవితమునకు కావలసిన ప్రారబ్ధము ఏర్పడినది. జన్మించిన సమయములో ఏర్పడిన ప్రారబ్ధమును కొంతవరకు తెలియడమును లేక గుర్తించుకోవడమును జాతకము (జాఫతకము)ను తెలియడము అంటున్నాము. జాతక విషయము తెలియుటకు రంగయ్య