పుట:Jyothishya shastramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరణములు మూడు రకములున్నాయి. కాబట్టి ఆయుష్షు విషయములో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు సత్యము కాగలదను నమ్మకము లేదు. ఆయుష్షు విషయములో ఒక్క యోగులు తప్ప మిగతావారు ఖచ్ఛితముగా చెప్పలేరని తెలియుచున్నది. ఇంతవరకు మనము జ్యోతిష్య శాస్త్రము ప్రకారము కర్మచక్రములోని మొత్తము పన్నెండు స్థానములలో ఏ కర్మ నిలువ ఉన్నదో తెలుసుకొన్నాము. ఇప్పుడు 46వ చిత్రపటములో 2,8 స్థానముల కర్మలను గుర్తించుకొని చూస్తాము

46వ చిత్రపటము. పూర్తి కర్మచక్రము

ఇప్పటికి కర్మచక్రములోని పన్నెండు భాగములలోని కర్మను కొంత వరకు గుర్తించుకొన్నాము. జీవితములో ముఖ్యమైన విషయముల కర్మలను మాత్రము గుర్తించి చూచుకొన్నాము. మనము చెప్పుకోని ఎన్నో