పుట:Jyothishya shastramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
46వ చిత్రపటము. పూర్తి కర్మచక్రము.

విషయములు మనిషి జీవితములో ఉన్నవి. ఉదాహరణకు సంతానమును గురించిన కర్మ ఏ స్థానములో ఉండునో మనము చెప్పుకోలేదు. సంతానము మనిషి జీవితములో ముఖ్యమైనది. ఎంతో ముఖ్యమైన సంతాన విషయము కర్మరూపములో ఎక్కడుండునో గమనించితే ఈ విధముగా తెలియుచున్నది. తల్లి తండ్రుల గుణములు పిల్లలకు వస్తాయి అంటుంటారు. అట్లే తల్లి తండ్రులు తెలివైనవారైతే పుట్టే పిల్లలు కూడా తెలివైనవారు పుట్టుదురని కూడ చెప్పుచుందురు. తల్లితండ్రుల లక్షణములే వారి పిల్లలకు వస్తాయి అని చాలామంది చెప్పుట విన్నాము. చాలావరకు వారు చెప్పినట్లే బయట కనిపించడము జరుగుచున్నది. ప్రపంచ జ్ఞానము ప్రపంచ బుద్ధులు తల్లి తండ్రుల వలన వచ్చినవారు అక్కడక్కడ కనిపించడము వలన తల్లితండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయని చెప్పడము జరుగుచున్నది. తల్లితండ్రులు అజ్ఞానులైతే పిల్లలకు కూడా వారి అజ్ఞానము రావడమూ, అలాగే తల్లి