పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్ని రాష్ట్రాలున్నాయి, ఎన్ని మతాలున్నాయి. ఆ మతాలేమిటి, భారతదేశపు ఆర్థికస్థితి ఏమిటి? సాంఘిక వ్యవస్థ ఏమిటి? తమ వారికి ఎప్పుడన్నా పట్టిందా?

ఈ 1934 నవంబరు (మహాత్మాగాంధి చేసే మహోత్కృష్ట కార్యక్రమం ఏమన్నా తనకుగాని, తనవాళ్ళకుగాని, తనబోటి తమ జాతివారికిగాని తెలుసునా? తామంతా తెలుసుకుందామని ప్రయత్నం చేశారా?

యూరేషియన్ జాతట? ఏషియో యూరపియనులు అన్న పేరు పెట్టుకోలేదట? అది సిగ్గు, అవమానకరం! తాము వేసుకునే దుస్తులు పాశ్చాత్య దేశాలల్లో పాకీదొడ్లు ఊడ్చే కూలీలన్నా వేసుకోరే! అయినా ఆ దుస్తులు వేసుకొని ఇంగ్లండునుండి పి. అండ్. కో., నౌకమీద అప్పుడే దిగి వచ్చిన ఆంగ్లేయులులా తల ఎత్తి తిరగడం, తలంతా బొప్పెలు కట్టడం!

దేహం యూరోపియనులకున్న నిర్మలతా, స్వచ్ఛతా లేకుండా, తెల్లదంతం రంగుకడ ప్రారంభించి నల్లటికారు రంగు వరకూ ఉన్నది.

జెన్నిఫర్ తల హృదయంపైన వాలిపోయింది. వక్షోజాలు నిట్టూర్పుతో ఊపిరి పీల్చినప్పుడల్లా పైకి ఉబుకుతున్నాయి, దిగిపోతున్నాయి.

తమలో నాయకులు లేరు, తమకు సలహా చెప్పేవారు లేరు. ఎవరు తమతో మానసిక పథాల దూరాలకు పోగలవారు? తమలో డబ్బున్న ఆ స్త్రీలు ఏదో కొంచెం మర్యాదగా బ్రతుకుతారు. కాని వారు కొంచెం చదువు చదువుకోని నర్సులుగా, టైపిష్టులుగా ఇంగ్లీషు షాపులలో అమ్మకపు స్త్రీలుగా చేరుతారు.

ఆమె ఆలోచనలే ఆమెకు భయం కలిగించాయి. ఆమె హృదయంలో భరింపరాని బరువులు చేరాయి.

ఇంగ్లీషులో నెమ్మదిగా తన పియానోమీద ఏదైనా ఓ పాట వాయించుకుంటే, ఆవేదన అణిగిపోవచ్చుననుకొంది. పియానో కడకు వెళ్ళి మీటలు నొక్కింది.

“మనుజుని తలపుల కవధే లేదా?
 మనసుకు బానిసహృదయమె కాదా?
 ఎవరికి వారే ఎరుగని పథముల
 దారి వెదుకుతూ దారిని సాగుతు
 ముందుకు పోవలె ముండ్ల పొదలలో
 గండశిలలలో కర్కశ భూమిలో!
                 మనుజుని.”

4

“జెన్నిఫర్‌లో ఏదో మార్పు వచ్చింది” అని యూరేషియన్ సంఘంలో యువకులు అనేకులు అనుకొనడం ప్రారంభించారు. ఎవరితోనైనా అవసరమైనప్పుడు తప్ప మాట్లాడడం మానివేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచన. తన సంఘం విషయం ఏమి చేయదలచుకొన్నారని, సంఘ నాయకులైన 'కాల్నెల్‌గిడ్నీ' 'హానరబెల్ పెరైరా' 'సర్ ఫెర్నాండెజ్' మొదలయిన వారికి ఉత్తరాలు వ్రాసింది. తన సంఘము హరిజన సంఘంకన్నా ఎక్కువ అధోగతిలో

అడివి బాపిరాజు రచనలు - 7

28

నరుడు(సాంఘిక నవల)