పుట:Gutta.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన చెప్పలేకపోయినా నేనుమాత్రము చెప్పగలను చూడండి. ఆయన తన చిన్న వయస్సు నుండి ఇతరులకు జ్ఞానమును చెప్పుచున్నప్పటికీ, తర్వాత ప్రబోధ, జననమరణ సిద్ధాంతమును 27 సంవత్సరముల వయస్సు లోనే వ్రాయడము జరిగినది. 2+7=9 అవుతుంది కదా! తొమ్మిదికి ఆయన జీవితములో ప్రత్యేకతగలదు. ఎందుకనగా 9 దైవమునకు గుర్తు అని ముందే చెప్పుకొన్నాము. ఆయన 27 సంవత్సరములో ఆత్మయొక్క ప్రత్యేకతను జననమరణ సిద్ధాంతమందూ, జీవునియొక్క కర్మబంధమును ప్రబోధ గ్రంథమందు వ్రాయడము జరిగినది. తర్వాత ఆయనకు 36వ సంవత్సరము కూడా ప్రత్యేకతను కూర్చినది. 3+6=9 అగుట వలన దైవత్వము యొక్క అంశ ఆయనలో ప్రజ్వరిల్లి, భగవద్గీతను త్రైతసిద్ధాంత భగవద్గీతగా వ్రాయునట్లు ప్రేరేపించినది. తర్వాత 45వ సంవత్సరము భగవద్గీత రచనను పూర్తి చేయడమూ జరిగినది. 54వ సంవత్సరము శ్రీ కృష్టమందిరమును ప్రబోధాశ్రమములో స్థాపించడము జరిగినది. తర్వాత ఇప్పుడు నందననామ సంవత్సరము ఆయనకు 63వ సంవత్సరము జరుగుచుండగా ఈ రచనను వ్రాయడము జరుగుచున్నది. ఈ విధముగా 27వ సంవత్సరమునుండి ప్రతి 9 సంవత్సరములకు ఒక ప్రత్యేకతను సంతరించుకోవడము జరుగు చున్నది. నందననామ సంవత్సరములో ఈ విధముగా జరుగునని శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో "ఆధ్యాత్మిక యోగ పురుషుడు మహా ప్రకాశము అగును" అని ఉన్నది. ప్రస్తుతానికి భూమిమీద యోగ పురుషుడు ప్రబోధానంద యోగీశ్వరులు తప్ప ఎవరూ లేరు. యోగ పురుషుడు అనగా పరమాత్మ అంశతోకూడుకొన్న ఆత్మను గలవాడు అని అర్థము. బ్రహ్మముగారు చెప్పినట్లు ఈ సంవత్సరము ప్రబోధానంద ప్రత్యేకత బయటపడవలసియున్నది. కావున ఆయన చేతనే బలవంతముగా ఈ పుస్తకమును వ్రాయించడము జరుగుచున్నది. ఇంతకాలము మసిపాతలోని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/41&oldid=279934" నుండి వెలికితీశారు