పుట:Gutta.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాణిక్యమువలెనున్న ప్రబోధానంద ఎటువంటి ఆత్మను కలిగియున్నాడో తెలిసిపోయింది.


నేను ఉంటే ఆయన ఉంటాడు. నేను పోతే నావెంటే ఆయన కూడా వస్తాడు. అవసరమనిపిస్తే ఇద్దరము మరొక తొమ్మిది (9) సంవత్సరములు ఉంటాము. అవసరములేకపోతే లేదు. ప్రబోధానంద యోగీశ్వరులకు 63 సంవత్సరములు వచ్చువరకు ఆయన వంశమువారైన గుత్తావారికి ఆయన ఎవరో తెలియదు. ఆయనకొరకే గుత్తా వంశము త్రైతసిద్ధాంతమును అనుసరించి ఏర్పడినదని గుత్తావంశస్థులకెవరికీ తెలియదు. బ్రహ్మముగారు చెప్పిన కాలజ్ఞానము ప్రకారము ప్రబోధానంద విషయము తెలిసినవారు చాలామంది సంతోషిస్తారు. నాకు తెలిసి ప్రబోధానందకు తన వంశము అంటే చాలా ఇష్టము. ఎక్కడాలేని అర్థము గుత్తావంశములో ఉన్నదని చెప్పెడివాడు. ఆ వంశములో పుట్టాలంటే కొంత పూర్వజన్మ పుణ్యము అవసరమని కూడా చెప్పెడివాడు. ప్రస్తుతము గుత్తావంశములోనున్న వారికి ఒక లాభముకలదు. తనవంశము యొక్క గొప్పతనమును తెలిసి, తన వంశము తయారగుటకు కారకుడు త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులని తెలిసి, ఆయనను ప్రత్యక్షముగాగానీ, పరోక్షముగాగానీ దర్శించుకొన్నవారికి కొంత కర్మ విముక్తి కలుగగలదు. ఆయన జ్ఞానమును పూర్తి తెలిసిన ఎవరైనా, ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా మానసిక బాధలు తొలగిపోవును. యోగీశ్వరులైన ఆచార్య ప్రబోధానంద త్రైతసిద్ధాంత జ్ఞానమును తెలిసి ప్రచారము చేసిన వారికి జన్మరాహిత్యము ఏర్పడగలదు. త్రైత సిద్ధాంతము ప్రకారము కాల, కర్మచక్రములను నుదుటి మీద ధరించిన వారిని చూచి దేవతలు, దయ్యాలు సహితము భయపడును.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/42&oldid=279923" నుండి వెలికితీశారు