పుట:Gutta.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొప్ప వ్యక్తి అనునట్లున్నా, అందరికీ ఆ విషయము అర్థము కాకుండుటకు భూమిమీద ఎందరో స్వామీజీలు, ఎందరో బాబాలు రావడమూ, వారు అనేక ఉపన్యాసములు చెప్పడమూ, అనేక గ్రంథములు వ్రాయడమూ జరిగినది. ప్రబోధానంద పుట్టిన తర్వాతనే విరివిగా స్వామీజీలు తయారు కావడము వలన వారిలో ప్రబోధానంద కూడా ఒక స్వామిగా లెక్కించబడి నాడు, అందువలన ఎవరూ ఆయనను ప్రత్యేకముగా గుర్తించలేకపోయారు.


ప్రబోధానంద చెప్పేబోధ మతాతీతమైనదై, అన్ని మతములలోని ప్రతి మనిషికీ వర్తించునదై ఉండెడిది. ఆయన బోధలలో ప్రకృతికి అతీతమైన పరమాత్మ బోధనలు ఉండేవి. ఆయన బోధలు దైవము మీద ఆసక్తివున్న వారికి మాత్రమే అర్థమయ్యేవి. దైవము మీద కాకుండా దేశము మీద, మతము మీద ఆసక్తియున్నవారికి అర్థమయ్యేవి కావు. ఆయన వ్రాసిన గ్రంథములలో కొన్నిటియందు అధికమైన దైవశక్తివుండేది. అటువంటి గ్రంథములను చదివినా, లేక భక్తిగా దగ్గరయుంచుకొనినా కొన్ని రకముల రోగములు, కొన్ని గ్రహబాధలు తొలగిపోయేవి. రోగములు, మేఘములు జీవమున్న జీవరాసులేనని ఆయన చెప్పేవాడు. ఇతర శరీరములలోనున్న రోగములను పలకరించేవాడు. జ్ఞానమార్గములోనికి వచ్చిన వారిని వదలి పొమ్మనేవాడు. ఆయన చెప్పినట్లే పెద్ద రోగములని పేరుగాంచిన రోగములు కూడా మాటవినేవి. ఆయన శరీరములో కొన్ని లోపములు ఏర్పడి ఆరోగ్యములో కొన్ని మార్పులు జరిగినా, అవి రోగములు కాకపోయిన దానివలన ఆయన శరీరము తిరిగి యధాస్థితికి వచ్చేది. ఏ రోగమైనా నా ఎరుకలేనిది నా శరీరములో ప్రవేశించదు అనెడివాడు. ఆయనకు 60 సంవత్సరములు పూర్తి అయినప్పుడు ఆరు రోజుల వ్యవధిలో నాలుగు మార్లు తీవ్రమైన గుండెపోటు వచ్చినది. అలా నాలుగుమార్లు వచ్చేవరకు ఎవరూ బ్రతకరు. తర్వాత దానిని సరిచేసుకోవడము జరిగినది. ఆయన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/39&oldid=279920" నుండి వెలికితీశారు