పుట:Gutta.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధానందగా పుట్టినపుడు, అంతములేని అంశ అయిన దానివలన అనంతలో పుట్టడము, అందరికంటే పెద్ద అయిన దానివలన పుట్టినపుడు పెద్దన్న అనుపేరు పెట్టడము జరిగినది. ఆయన ప్రత్యేకతను అందరూ గమనించనట్లు అదే జిల్లాలో, అదే ఊరిలో పుట్టిన చాలామందికి కూడ అక్కడక్కడ పెద్దన్న అనుపేరు పెట్టబడినది. ఆయనకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఒక స్వామీజీవద్ద మంత్రోపదేశమును పొందినప్పుడు ప్రబోధానంద అని పేరు పెట్టబడినది. అప్పటినుండి పెద్దన్న అను పేరు పోయి ప్రబోధానంద అను పేరు వచ్చినది. అప్పటినుండి ప్రపంచ వ్యవహారములలో గుత్తా ప్రబోధానంద చౌదరిగా, ఆధ్యాత్మిక విషయములలో ప్రబోధానంద యోగీశ్వరులుగా కొనసాగడము జరిగినది. తర్వాత త్రైతసిద్ధాంతమును ప్రతిపాదించినప్పటి నుండి త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులుగా చలామణి అగుచున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథములను ఆయన వ్రాయడము జరిగినది. ఇంతవరకు ఎవరూ వ్రాయని విషయము లను మరియు చెప్పని విషయములనే వ్రాసెదనని చెప్పి వ్రాసెడివాడు. ఒక్క ఇందూ (హిందూ) మతములోని ఆధ్యాత్మిక రహస్యమునే కాక, ఇస్లామ్‌ మరియు క్రైస్తవ మూలగ్రంథములైన ఖురాన్‌ మరియు బైబిలు గ్రంథములలోని సూక్ష్మాతి సూక్ష్మ విషయములను కూడా అవలీలగా చెప్పెడివాడు. ఇతర మత గ్రంథములలోని వాక్యములకు మీరెలా వివరమును చెప్పగలుగుచున్నారని అడిగినపుడు ఆయన ఇలా సమాధానము చెప్పెడివాడు. ‘‘నేను గ్రంథములను చూచి ఏదీ చెప్పలేదు. నేను చెప్పినదే గ్రంథములలో వ్రాయ బడివున్నది. నా బోధలకు వ్యతిరేఖమైన ధర్మములు ఏ మూల గ్రంథములలో లేవు. నాకు తెలియని ఆధ్యాత్మిక రహస్యములు ఏవీలేవు. నా ధర్మములను అనుసరించిన మూలధర్మములే అన్ని గ్రంథములలో ఉన్నవి’’ ఈ మాటలను విన్నవారు ఎవరైనా, ఇవి సామాన్యమైన మాటలు కాదు, చెప్పిన వాడు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/38&oldid=279637" నుండి వెలికితీశారు