పుట:Gutta.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడిగితే, వ్రాసేదిగానీ, చెప్పేదిగానీ నేను కాదు నాకు తోడుగా ఉన్న ఆత్మ అని చెప్పేవాడు. అన్ని పనులు ఆత్మే చేయుచున్నదని అందరికీ చెప్పేవాడు.


త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అను పేరుతో త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక విద్యలో ఎన్నో రహస్యములను చాలా గ్రంథముల రూపముతో వ్రాయడము జరిగినది. గ్రంథములను చదివిన వారు అందరూ ఇవి చాలాగొప్ప గ్రంథములనీ, ఇంతవరకు మాకు తెలియని జ్ఞానము తెలిసినదనీ చెప్పెడివారు. చదవని వారు త్రైత సిద్ధాంతము అంటూనే ఇదేదో క్రైస్తవులకు సంబంధించినదని అసూయగా చూడడమేకాక, ప్రబోధానంద యోగీశ్వరులను క్రైస్తవ బోధ చేయుచున్నావా అని నిందించెవారు. ఇంకా కొందరు హిందువుల ముసుగులో క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నారని ఆరోపించేవారు. విశ్వహిందూ పరిషత్‌లాంటి హిందూమతసంస్థల మనుషులు చాలామార్లు ప్రబోధానంద శిష్యులమీద దాడి చేయడము కూడా జరిగింది. ఈ గ్రంథములు దేనికి సంబంధించినవని చూడకుండానే భగవద్గీత అని పేరున్న త్రైత సిద్ధాంత భగవద్గీతను కూడా అగ్గిపెట్టి కాల్చడము జరిగింది. ఇలాంటి చర్యలను చూచిన ప్రబోధానంద ‘‘నేను చెప్పితేనే హిందూధర్మములేవో తెలియ బడేది. అటువంటి హిందూధర్మములున్న గ్రంథములను కాల్చువారు హిందువులా? వీరికి పెద్ద పాపమే చేరింది. అది ఒక జన్మతో అయిపోదు’’ అన్నాడు. ప్రపంచములోని మనుషులు కొందరు మాత్రమే ఆయన జ్ఞానమును చూచి ప్రశంసించి అనుసరించుచుండగా, కొందరు మాత్రము మతములను అడ్డము పెట్టుకొని మాట్లాడడము ఆయనకు కొంత ఇబ్బంది కరముగా తోచినది.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/19&oldid=279904" నుండి వెలికితీశారు