పుట:Gutta.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక మనిషిగా ఆయనను ఆలోచింప చేసినది. ఇంత మూర్ఖులకు నేనెందుకు జ్ఞానము చెప్పాలి? నేను కూడా అందరివలె బ్రతుకవచ్చును కదా! నేను బయట వ్యాపారములలో సంపాదించిన సొమ్మునంతటిని ఖర్చుచేసి ఎవరి చేతినుండి డబ్బును ఆశించక కృష్ణమందిరమును కట్టించి నప్పటకీ, ఎన్నో గ్రంథములు వ్రాసి జ్ఞానమును తెలియజేసినప్పటికీ, అందరి స్వాములవలె డబ్బుకోసమే ఇదంతా చేస్తున్నాడను మనుషుల కొరకు ఎందుకు చేయాలి? నా మంచితనమును ఇటు బంధువులుగానీ, కులస్థులుగానీ, బయటవారుగానీ ఏమాత్రము గ్రహించక నీచముగా, హేళనముగా మాట్లాడునప్పుడు అందరికీ అవసరమైన దానిని నేనెందుకు చేయాలి? అనుకోవడము జరిగినది. ఒక సాధారణ మనిషికి వచ్చే ఆలోచనే ఆయనలో వచ్చినా కొన్ని సందర్భములలో అన్నిటిని మరచిపోయి జ్ఞానమును చెప్పెడివాడు. అప్పటినుండి హిందువులకే కాకుండా, ఇటు క్రైస్తవులకు అటు ముస్లీమ్‌లకు కూడా జ్ఞానమును చెప్పెడివాడు. ఇలా ప్రబోధానంద చెప్పే జ్ఞానము క్రైస్తవులకు, ముస్లీమ్‌లకు బాగా నచ్చేది. ముస్లీమ్‌లు వచ్చినపుడు ఖురాన్‌ గ్రంథములోని వాక్యములకు సరిపోయే జ్ఞానమూ, క్రైస్తవులు వచ్చినపుడు బైబిలులోని వాక్యములకు సరిపోవు జ్ఞానమును చెప్పెడివాడు. ఒకవైపు అలా జరుగుచున్నా ఒకవైపు నేనెందుకు ఇతర మతముల వారికి జ్ఞానమును చెప్పాలి? అను ప్రశ్న వచ్చేది. ఆయన గ్రంథములు చదివిన హిందువులు కొందరు ఈయన నిజముగా దేవుడే అని అనగా, ఆయన బోధలు వినిన క్రైస్తవులు, ముస్లీమ్‌లు గొప్పగా చెప్పుకొనెడివారు. అయితే ప్రబోధానంద అప్పుడప్పుడు ఇలా ఆలోచించేవాడు. ‘‘సంస్కృతము ఏమాత్రము రానినేను శంకరాచార్యులు వలె సిద్ధాంతకర్తనా? అని అనుకొనెడివాడు. ఒక సాధారణ మనిషి యోచించునట్లు అజ్ఞాన పొరలు క్రమ్ముకోగా ‘‘ ఏ జ్ఞానమూ తెలియని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/20&oldid=279930" నుండి వెలికితీశారు