పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/498

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ ప సం హా రం

   ఆంధ్రజాతీయసంస్కృతికి ఈ జానపద కళలు, క్రీడలు, వేడుకలు చేసిన దోహరం గణనీయం. ఇందులో చెప్పబడినవన్నీ గోదావరిసీమలోని కళాకారులు ప్రేదర్శించితో లేక ఇతర ప్రాంత కళారులచే గోదావరిసీమలో ప్రదర్శింపబడినవో మాత్రమే.
    విద్యాలయాలులేని ఒకనాడు ఈ జానపదకళలే విజ్ఞానప్రదాయములుగా భాసిల్లాయి.  అక్షరజ్ఞానం లేకున్నా, వివక్షణాజ్ఞానాన్ని కలిగించాయి.  నీతి, నియమం, సదాచారం, సద్బావనం ప్రోదిచేసి కలతలూ కలహాలూలేని వాస్తవరీతుల్నీ ఉద్భోదించాయి.  ఆచారవ్యవహారాల పేరుతో ఉత్తమరీతుల్ని ఉద్బోదించాయి.  నాటి క్రీడలు, వేడుకలు ఖర్చులేకుండా మానవుని మానసిక, శారీరక వికాశానికి, వినోదానికి ఎంతో దోహదంచేశాయి.  పేరుకు కులమతాలున్నా చేతలలో దానికిఅతీతంగానడిపించి సామరస్యజీఫన కాముకాలయ్యాయి.  విషయపరిజ్ఞానం వ్యవహారరీతి సుగమరీతిలో శరీరంలోని అణువణువుకూ అందించి మనిషి పుట్టుకనుండి చవువరేకూ జీవితాన్ని తీర్చిదిద్దాయి.  "ఆనందోబ్రహ్మ" అనేది మూలసూత్రంగా యివన్నీ అల్లబడ్డాయి. అందుకే ఆ రోజుల్లో చిదానందంగా బ్రతకగలిగారు.  ఉన్నంతలో తృప్తిపడి, కలిగినంతలో ప్రక్కవానికిపెట్టి ఆనందించారు.  "కర్ంఅణ్యే వాధికరస్తే, మాఫలేమకదాసన" అన్న గీతాకారుని వాక్యానికి అనుసరణగా "గాలిలో దీపంపెట్టి దేవుడా! నీదేభారం" అనకుండా తనవంతు కర్తవ్యం తనునిర్వర్తించి, చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టించుకొని బ్రతికిఉన్నకాలాన్ని బంగారుమయంచేసుకొని, తానింతతిని,  పరులకింతపెట్టి ఆదర్శంగా భాసించగలిగారు.
     కాలగమనంలో వీరిఅభిరుచులూ, ఆచరణాలూ అనాగరికంగా భావించ బడ్డాయి - ఆచారాలు మూఢాచారాలని నిరసింపబడ్డాయి.  దానిలో ఈ కళలు కూడా నీరసపడ్డాయి. ఇలా యీ జానపదసంపద తీవ్ర తిరస్కారానికి గురికావడంతో వారిఉత్తమపద్దతులుకూడా తెరమరుగుకుపోయాయి. దేనిలోనైనా మంచి చెడ్డలు సహజం. అందులో చేడ్డనువదిలేసి మంచిని గ్రహించడం ఉత్తమ లక్షణం. అంతేగాని ఎవోకొన్ని లోపాలుచూసి ఆవ్యవస్థనే సమూలంగా నాశనంచేయడం సంస్కృతికీ, సమాజ అభ్యు