పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/499

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్నతికి గొడ్డలిపెట్టు. "పాతరోత, క్రొత్తవింత" ధోరణి ప్రబలడం శోచనీయం. మన సంస్కృతిలోని విజ్ఞానాన్ని, వినోదాన్ని ఏకాలానిదైనా, ఎవరిదయినా మనం వినియోగించుకొని లబ్ధిపొందటం విజ్ఞత, దభ్భాపాలు రుచిమరిగి తల్లిపాలనుధ్వేషించడం బిడ్దకు శ్రేస్థంకాదు. చెట్టుంకాసినపండుకంటే ఆరోగ్యంకావు వండుకున్న పదార్ధాలు. కాబట్టి మన సంస్కృతిప్రసాదించిన సహజ నిజ్ఞాననిధుల్నిభూస్థాపితంచేసుకుంటే అది జాతికే నష్ఠం. ఆలస్యంగానయినా ఈ సంగతిగ్రహించిన విశ్వవిద్యాలయాలు, మేధావులు ఇప్పుడు జానపద సంపదపై దృష్టీ సారించి పరిసోధనకు పూనుకొనడం, పురికొల్పడం శుభపరిణామం.

  ఈ కళాఇజృంభణతో దేశంలో సాంస్కృతికవిప్లవంవచ్చి నాగరికతపేరుతో కృత్రిమ వాతావరణంలో, యాంత్రికజీవితంతో మనిషిపట్ల మనిషికుండవలసిన మమతాంరాగాల్ని గోల్ఫోయి, నైతికవిలువలుపడిపోయి, పతనమౌతున్న సమాజానికి "తానెవరో"తెలిపి పూర్వపు ఔన్నత్యానికి పూలబాటవేస్తుందని ఆసిద్ధాం.  'తానెవరో 'తెలుసుకొనడానికి అతని సంస్కృతిని కళ్ళెదుటబెట్టడమే ఈ పరిశోధన లక్ష్యం.