పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనుగడ అంత దీర్ఘకాలిమమైనది. దొండాకు చలవచేస్తుంది. కాకరకాయ సర్ం క"డుపులో నులిపురుగుల్ని చంపుతుంది. చక్కెరవ్యాధికి కూడాయిదిమందే. ఆనపకాయ, బీరకాయ, పొట్లఖాఆయాలలో విటమిన్లు పుష్టిగా ఉండడమె గాక సులువుగా జీర్ణమౌతాయి. అందుకే పత్యానికి యీకూరలు వాడతారు. వంకాయ ఆరోగ్యరీత్యా మంచిచెడ్డలెలా ఉన్నా ఇది రుచి రాజము. "వంకాయ్ వంటి కూరయు, లంకాపతిపైరివంటిరాజులుకలరే ' అంటారు ఓ కవి. బెండకాయ ముదరకుండా ఉంటే మంచి ఆహారం. ముదిరితే మాత్రం ఒక ముతకసామెతుంది. "బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ప్రమాదం ' అని. అందుకే కోసేటప్పుడు యీకాయలు ముచ్చికలు విరిచి చూచుకుంటారు.

బూడిద గుమ్మడికాఅయ వడియాలు పెట్టుకొని వేపుకుతెంటే బలే రుచిగా ఉంటాయి. దీని గింజలు కడుపులో పాములున్న వాళ్ళకి పాములమందే.

                           ఆ కు కూ ర లు

గోంగూర పచ్చడి తెలుగువారి ప్రత్యేకతకు తెలిపే వంటకం. దీనినిండా ఖనిజ లవణాలుంటాయి. బచ్చలకూర, తోటకూర, పొన్నగంటికూర, మెంతుకూర, సుఖవిరేచన కారులు. మలబద్ధకాన్ని తొలగిస్తాయి. పొన్నగంటికూరను సంసృతంలో 'జనార్నవ ' అంటారు. దీనిలో బంగారు ఖనిజం ఉందట. తమిళంలో 'పొన్న 'అంటే బంగారం అని అర్థం. దీన్నిండా 'ఎ ' విటమినే. అందువల్ల కంటిజబ్బులకు ఇది ఉపయోగకారి.

మామూలుగా యివికడుపు నింపుకోవడానికి తింటున్నామనుకున్నా మనిషి జీవితానికి కావలసిన పోషక పదార్థాలు నిండిఉండడంతో అవి అందుబాటులో ఉండేలాగ ఆలోచించి జానపదులు పెరళ్ళలో పెంచేవారు. ఈ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా నూరేళ్ళు బ్రతికేవారు. ఇప్పుడు చెట్లను పెంచడం మాని కొట్టేయడం ప్రారంభించారు ప్రతి గజం స్థలంలోనూ యిల్లు కట్టేసి అద్దెలకెచ్చేసి ఆదాయం సంపాదించేయాలని. ఇది పల్లెలకు కూడా ప్రాకిపోయింది. అందుకే "సుజలాం, సుఫలాం, మలయజశీతలాం, సస్యశ్యామలాం" ప్రార్ధనకే పరిమితమైపోయింది. చెట్లులేక