పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కా శీ కా వి డి

         కాశీకావిడి భుజానవేసుకొని, తలకుగుడ్డ, భుజంమీద రుమాలుతో బ్రాంహణుడు వస్తాడు.  కాశీ రామేశ్వర క్షేత్రాలుదర్శించి గంగాతీర్ధం తెచ్చానంటూ గుమ్మాలదగ్గర కావిడిదింపి కావిడికిరువైపులాఉన్న సంచులనుంచి చిన్నచిన్న భరిణలుతీసి, ఆభరిణల్లో ద్రవములోతేలుతున్న బొమ్మలుచూపుతూ చేపఉన్న భరిణీచూపి అదిమత్స్యావతారమనీ, తాబేలున్న భరిణచూపి అది కూర్మావతారమనీ చెబుతాడు.  మరొక భరిణలో ఒక స్త్రీబొమ్మ తేలుతుంటుంది.  ఆమె సీతాదేవి. ఒకవైపు రామునిబొమ్మ, ఒకవైపురావణునిబొమ్మవేసివున్న బిళ్ళను ఆమె ముఖానికి అభిముఖంగా చూపెడుతుంటే రావణాబ్రహ్మవచ్చినప్పుడు ఆ స్తీబొమ్మముఖం వెనక్కి తిరిగిపోతుంది.  రాముని బొమ్మ చూసినప్పుడు నిలిచిపోయిచూస్తుంది.  అది మనకు విచిత్రంగా కనిపిస్తుంది.  (దానిలోని కిటుకు ఆ బిళ్ళలోఉన్న అయస్కాంతం) ఈ చోద్యానికి ఆచుట్టుప్రక్కలవాళ్ళంతా చేరతారు.  అలా చేరగానే ఒక గొట్టంలోనుంచి చుట్టివున్న బొమ్మ్లపటం తీసివిప్పి ఒకపేముబెత్తంతో అందులోని బొమ్మలు చూపిస్తూ, వానివిషయంవివరిస్తుంటాడు.  ఆపటంలో పాపాలుచేసినవాళ్ళు నరకంలో ఏపాపానికి ఎలాంటిశిక్షలు అనుభవిస్తున్నారో చూపేబొమ్మలు పై నుంటాయి.  అందులో పరమలోభి ఇల్లోనారాయణమ్మ భర్తను పెట్టినభాధలూ, గయ్యాళితనంతో ప్రజల్ని పెట్టే హింసలూ వర్ణించిచెప్పి నరకంలో ఆమె అనుభవిస్తున్న శిక్షలు చూపిస్తారు.  ఈ పాపాలకు శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి.  వ్యభిచారిణికి అగ్నిలోకాలుతున్న ఉక్కుస్థంభానికి కౌగలింపచెయ్యడం ఇతరపాపాలకు సలసలమరిగే నూనెలో పడేయ్యడం లాంటివిచూపిస్తుంటే పాపంఅంటే భయమేస్తుంది.  చివర దానధర్మాలుచేసి పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు స్వర్గం లో ఎలా సుఖాలు అనుభవిస్తున్నారో బొమ్మలు చూపుతూ చెబుతుంటే అప్పుడే అతనికి ధర్మంచేసేసి పుణ్యం మూటగట్టుకోవాలనే టంత అవేశంపొంది పళ్ళేలనిండా బియ్యం తెచ్చి అతనిజోలి నింపేస్తారు.
                          గుం పో ళ్ళు
          గుంపోళ్ళు పూర్వంవచ్చేవాళ్ళు - సంక్రాంతి నెలలోనే. యిది దొంగలముఠా, వీళ్లు ఊరిలోకి వస్తున్నరంటే అందరికీ హడలే, అందుకని