పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/475

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మునసబు కరణాలు గ్రామనౌకర్లనుతోడిచ్చి ఇంటింటికీ తిప్పేవారు. ఇంటికో తవ్వెడు బియ్యం, పావలాడబ్బులు మామూలు. ఇప్పుడు ఈ బాపతు గుంపోళ్ళులేరు. అందరిలాగే వీరుకూడా కూలీ, నాలీ చేసుకు బ్రతుకుతున్నారు. పనిలేనివాళ్ళు మామూలు ముష్ఠివాళ్ళలాగే అడుక్కుంటున్నారు ఎవరిమట్టుకువాళ్ళే.

                     మా ది గ జ ట్టు
     కొన్నిచోట్ల ఈ పండుగనాలుగురోజులూ ఊళ్ళోమాదిగలు జట్టుగా కూడి కొందరు డప్పులువాయిస్తుంటే, కొందరు కాళ్ళకు గజ్జెలుకట్టుకుని "లేలే లేలే లేల్లేలయో రామారామా లెల్లేలయో" అంటూ తుమ్మదపదాలూ, వెన్నలపదాలూ పాడుతూ గుమ్మాలముందు ఎగురుతుంటారు.  ప్రతివారూ చేటనిండా ధాన్యంఇస్తారు.  అది చేత్తో పట్టుకుని "పెద్దకాపుగారు, పెద్దదొరగారు పెద్దమారాజులు, సిరితో వర్దిల్లాలి, పిల్లా జల్లాతో భాగ్యవంతులయి శుభోజ్జయంగా వర్ధిల్లాలోహోయ్" అంటూ ప్రతిమాట తరువాత డప్పుమీద ఒక దెబ్బకొడుతూ దీవిస్తూ వెళుతుంటారు.
                              మాలలజట్టు
       మాలలజట్టువాళ్ళు ఒకఆబోతును బంతిపూదండలతో అలంకరించి, దానిమెడకు మువ్వలూ, గంటలూకట్టి, ఇద్దరుముగ్గురు ఇత్తడితాళాలతో వాయిస్తూ 'శ్రీరామా రామారా మోరామా రామయ్యా హరిరామా రామరామయి వోధ్యా రామా ' అని పాడుతూ ఇంటింటికి తిరుగుతుంటే వారికి కూడా చేటనిండా ధాన్యం పెడతారు.
                    చా క ళ్ళ జ ట్టు
        చాకళ్ళు జట్టుగా బల్లలపండగ చేసుకుంటామని ఇంటింటికి తిరిగి బియ్యం ప్రోగుచేసుకుంటారు.  (బల్లలపండగంటే చాకిరేవుబల్లలకు కోడిని గాని, మేకనుగాన్9ఇ కోసి పండుగగా చేసుకుంటారు.) సంక్రాంతిపండుగ వెళ్ళినదగ్గరనుంచీ బల్లలపండుగరోజువరకు బట్టలుతకరు.  ఈ బల్లలపందుగ మురునాటినుండి బట్టలుతకడం ప్రారంభిస్తారు.  ఈ పండుగ వారు సామూహికంగా చేసుకుంటారు.