పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/473

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూసలదండలు ధరించి కాళ్ళకు గజ్జెలుకట్టుకుని, సీతారామలక్ష్మణుల బొమ్మలతికిన ఒకఇత్తడిసెమ్మేలోఒత్తులేసి నూనెపోసి వెలిగించి, "సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము" వంటి రామదాసుకీర్తనలుపాడుతూ నృత్యంతో అభినయిస్తూ గుమ్మంగుమ్మం దగ్గరా ఆగుతుంటే భక్తితో ఆ సెమ్మేలో నూనివడ్దిస్తొ ఆసెమ్మె అడుగునగల మసెతీసి బొట్టుపెట్టుకుని దోసిళ్ళతో బియ్యం వేస్తుంటారు. వాళ్ళు నెమలిఈకలకట్టతో నెత్తిమీద రాసి దీవిస్తుంటారు.

        వీళ్ళ స్త్రీలు అద్దాలు, దువ్వనలు, నల్లపూసలు, లక్కజోళ్ళు, ముగ్గుగొట్టాలు వగైరా తట్టలోపెట్టుకుని నెత్తికెత్తుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ము తుంటారు.  పెళ్ళిళ్ళలో పళ్ళాలతో వీళ్ళఇళ్ళకు బియ్యంతీసుకువెళ్ళి ఇచ్చి నల్లపూసలు, లక్కజోడులు తెచ్చుకుంటారు పల్లెజనాలు.
                           కొ మ్మ దా స రి
      గొల్లబాలుడువేషంలాగ నుదుట, చేతులకు, గుండెమీదా పంగనామాఉ పెట్టుకుని, కురచలాగు తొడుక్కుని నెత్తికిజోకర్ టోపీ పెట్టుకుని చెట్టుకొమ్మచేత్తో పట్టుకునివచ్చి నాలుగురోడ్లసెంటరులో క్రిందరుమాలు పరచి దగ్గరున్నచెట్టుపైన గానీ, పిట్టగోడపైగానీ ఎక్కి కూర్చొని -

                  "పడిపోతున్నా వచ్చేయ్యోయ్
                    కొమ్మ దాసరి నండప్పయ్యోయ్
                    కొమ్మ దిగితే కోటివేలిచ్చినా పుచ్చు
                    కోనండప్పయ్యోయ్
                    ఎర్రకోక కట్టుకున్న ప్పయ్యోయ్
                    సూరమ్మప్పయ్యోయ్, సుబ్బమ్మప్పయ్యోయ్
                    కాంతమ్మప్పయ్యోయ్, పడిపోతా, పడిపోతా".

    అంటూ అరుస్తూ ఆ చుట్టుప్రక్కలవారందరిదృష్టి తనవైపు తిప్పుకుంటారు కొమ్మదాసరి. అతనిమాటలకు నవ్వుకుంటూ స్త్రీలు అతనిరుమాలు మీద దోసిళ్ళతో  బియ్యంతెచ్చి వేస్తుంటారు.  ఇదో విచిత్రమయిన యాచన.