పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/464

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వికాసాన్నుద్బోదిస్తాయి. కాళిదారు అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వుడుకూడా శకుంతలను "శుశ్రూషస్వ్గురూన్ ఒరు ప్రియసబీవృంతం సపర్నే జనే". అని బుద్దులు గరిపి పంపుతారు.

      పూర్వం యీ తంతులన్నీ అయిదురోజులకు విభజించి పెళ్ళిరోజనీ, బూర్లాయితనీ, క్జంకణాలు విప్పేరోజనీ, టింకినీళ్ళు దొఇష్టితీసేరోజనీ, వసంతోత్సవ దినమనీ, ఒప్పగింతలనీ, నాగవిల్లనీ ఒక్కో ప్ర్రాంతంలో ఒక్కోపేరుతో ఐదురోజులు వేడుకగా చేసేవారు.  అవకాశంలేనివాళ్ళు అన్నీకలిపి ఒకేరోజు 'ఏకరాత్రి ' పెళ్ళీ చేసేవారు.
     ఏమైనా ఈ వేడుకలన్నీ అపరిచితులైన వధూవరులను అత్యంత సన్నిహితులను చెయ్యడానికి, మమత, ఆప్యాయత, అనురాగం ఆ సంసారంలో బలంగా పాదుకోవడాన్మికి గట్టిగావేసేముడులు.  నాటిపెళ్ళిళ్ళలో అన్నీ వేడుకలే - అందరికీ వేడుకలే.  నేటి పెళ్ళిళ్ళలో ఒక్కటేవేడుక - ఒక్కడికే వేడుక. ఆ ఒక్కటే వరకట్నం - ఆ ఒక్కడూ పెండ్లికొడుకు.