పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/430

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాలి. "ఆట ' కాచాలంచే పట్టుపట్టిన పిక్కలు యివ్వాలి. 'మాట ' కావాలంటే రెందవచేతిపిక్కలు యివ్వాలి. చేతిలో ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత గుట్టలో పిక్కలు తీసిపరచి గెచ్చనరాళ్ళలోలాగే ఒజపిక్కను పైకివిసరేసి అందుకుంటూ క్రింది పిక్కను బొక్కొతూ, పుంజదకాగానే ఎగరేసి ఎడమచేతితోపట్టుకొని తమప్రక్కన పెట్టుకుంటారు. ఆటపిక్క చేతి లోనే ఉంటుంది.

     ఎగరేసినపిక్కను అందుకోలేకపోయినా, క్రిందపిక్కను బొక్కలేకపోయినా, పిక్కను బొక్కేటప్పుడు ప్రక్కపిక్కకు వ్రేలు కంగినా ఆట పోయినట్టే.  అప్పుడు మరల రెండవవారూ మిగతావారూ ఇదేవిధంగా ఆడతారు.  మొదటిఆటకు పోసిన పిక్కలు అయిపోయినప్పుడు ఆఖరివారిది చేతిపట్టు అవుతుంది.  మరల మనిషికొకగుర్రంచొప్పునపోసి మళ్ళా ఆట మొదలెడతారు.  చేతిపట్టువచ్చినవాళ్ళు గుర్రంపైన ఒకపుంజీ ఎక్కువపొయ్యాలి.  ఎవరిదగ్గరయినా గుర్రానికి తక్కువపిక్కలుంటే మిగతావారందరూకూడా అన్నేపోస్తారు.  ఈ విధంగా ఆట మరలా ఆడతారు.  పిక్కలు అయిపోయినవారికి మిగిలినవారు తలొక మూడు పుంజీలు అప్పుయిస్తారు.  వీరిని "గొద్దిపుంజీ" అనీ "గోకుడు పుంజీ" అనీ అంటారు.  ఈపిక్కలను తీర్చలేనివారు ఓడినట్టు.  ఈ ఓడించడానికి "గొద్ది పెట్టుట" అంటారు.
       ఆఖరున ఎవరు ఎక్కువ గుర్రాలు సంపాదిస్తే వాళ్ళు మేటి.  ఇది కూడా ఏకాగ్రతకూ వ్రేళ్ళ పరిక్రమకూ సంబంధించినది.  కష్ఠపడి ఆర్జించఛమనేది యీ ఆటనేర్పే సుగుణం.
                        త క్కె డా ట
    సుద్దముక్కతో నేలమీద ఒకదానిలోఒలటొచొప్పున మూడు చదరాలు గీసుకొని మధ్యలో నిలువుగా, అడ్దుగానూ పై చదరంనుండి లోఫల చదరంవరకూ నాలుగువైపులా నాలుగుగీతలుగీసి, దానితో మూడుచదరాలనూ కలుపుతారు.  దీనితో ఏగీతమీదచూసినా మూడుమూలలు కనిపిస్తాయి, చిన్న చిన్న రాళ్ళుగాని, చింతపిక్కలుగాని, సీతాఫలగింజలు గానీ యిద్దరూ చెరొకరకం పదకొండేసి తీసుకొని ఒకరితరువాతఒకరు