పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/429

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇది మరోరకంగాకూడా ఆడతారు. ఐదు గచ్చకాయలను చేతిలో పట్టుకొని వానిలో ఒకదానిని పైకెగరేసి ఆకాయ క్రిందికిదిగేటంతలో చేతిలో నాలుగుకాయలూ నేలమీదవిడిచి ఒక్కొక్క పర్యాయము మూడు కాయలు, ఒక్కొక్కపర్యాయము రెండేసిచొప్పున రెండుమార్లుగా నాలుగుకాయలు, ఒక్కొక్కమారు ఒక్కొక్కటిచొప్పున విడివిడిగా నాలుగుకాయలు చేతిలోనికి జరుపుకొని పైకెగరేసిన కాయనందుకుంటారు. ఆడేటప్పుడుగాని, కాయలను ఎగరేసిపట్టుకొనేటాప్పుడు గాని, జరుపుటలోగాని తప్పిపోతే ఆట తప్పినట్లు, ప్రక్కవానికి ఆటని అవి యిస్తారు.

    • "ఈ ఆట ప్రసక్తి హంశ వింశతి, కళాపూర్ణోదయం, భోజరాజీయాది అనేక కావ్యములందు కలదు"
                         చిం త పి క్క లాట
     ఇద్దరుగాని, ముగ్గురుగాని, నలుగురుగాని స్త్రీలు తమ యిండ్లనుండి చింతపిక్కలు తెచ్చుకుని సమానభాగములుగాకలిపి గుట్టపోసి తమ మధ్యపెట్టుకొని ఆ పిక్కలతో ఆడతారు.  ఈ పిక్కలలెక్కను వీరువాడే మానం "పుంజీ", "కచ్చటా", "గుర్రం" అని. నాలుగుగింజలు ఒకపుంజీ, రెండుపుంజీలు ఒకఛ్ఛటా, అయిదుకఛ్ఛటాలు ఒకగుర్రం.  ఒకరు మొదట చింతపిక్కలుతీసుకొని కుడిచేయివనక్కిత్రిప్పి ఆవ్రేళ్ళమీద వానినినిలిపి, పైకిఎగురవేసి దోసిట్లోకి అందుకుంటారు.  దాన్నే పట్టుపట్టడం అంటారు.  అప్పుడు వానిని కుడిచేయి గుప్పెటలోకితీసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్కపుంజీచొప్పున కుడిచేతి వ్రేళ్ళ సహాయంతోనే గుప్పటాబయటకులాగి, ఎగరేసి ఎడమచేతిలోకి అందుకోవాలి.  ఎగరేసినప్పుడు ఒక్కపిక్కకూడా క్రిందపడకూడదు.  పిక్కలు సరిగ్గా పుంజుడూ లాగాలి.  లాగేటప్పుడుకూడా పిక్క క్రిందపడకూడదు.  ఇలా నాలుగు పిక్కలుచొప్పున తీసికోవడంలో ప్రమాదవశాత్తు 3గాని 5గాని పిక్కలు రెండవచేతిలోకివస్తే తన ఏదమచేతివైఉవారిని "అటా? మాటా?" అని ఆడ

    • విజ్ఞానసర్వస్వము - తెలుగుసంస్కృతి. పు. 1440 శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ.