పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • "ఉప్పెన బద్దెలు (ఉన్నట్లు) చెరుగుడాట, బొంగరాలయాట, గాలిపటము ఎగురవేయుట, అచ్చన గండ్లయాట,ఓమనగుంటలు, జూదము, పులిజూరము, చదరంగము మొదలైనవి ఆరేడువందల సంవత్సరములకు పూర్వమునుండి ఉన్న యాటలు."
  పల్లెలలోకూడా నవనాగరికత ప్రజలతో జానపదుల ఆటలూ పాటలూ చాలావరకు తెరమరుగున వడ్డాయి.  ఆనాటి ఆటలూ, క్రీడలూ సహజ సిద్దమైనవి.  చిన్నతనంనుండీ మనిషిలో సంఘీభావాన్నీ సఖ్యతనూ సహజీవనాన్నీ విజ్ఞానాన్నీ సహృదయతనూ శౌర్యాన్నీ సాహసాన్నీ వివేకాన్నీ పెంపొందింపచేయడమే వాని లక్ష్యం.  చిన్నపిల్లల ఆటలదగ్గరనుంచీ పెద్దవాళ్ళక్రీడలవరకూ అన్నింటా ఏదో ఒక ప్రయోజనం ఇమిడి ఉంటుంది.
                                 పి ల్ల ల ఆ ట లు
                                      బు వ్వా లా ట
    దీనినే "గుజ్జన గూళ్ళాట" అనికూడా అంటారు. కొందరు పిల్లలు ఒకచోట చేరతారు.  తమ యిండ్లనుండి ఉప్పో,  పప్పో., చింతపండో, ఉల్లిపాయలో, కారమో ఏదో ఒకటి తెచ్చి సఖ్యంగా తమ లక్కపిడతలలోనో చిన్ని గిన్నెలలోనో వాళ్ళే వండుకొని తింటూ "బువ్వాలాట" ఆడుతుంటారు.  తరువాత "అమ్మా-నాన్న" ఆట అనీ బొమ్మల పెళ్ళిళ్ళనీ ఇంట్లో పెద్దవాళ్ళ పనిపాటలు, నిత్యకృత్యాలు, ఆచార వ్యవహారాలు అన్నీ చక్కగా అనుకరిస్తూ వినోదిస్తారు.  ఇది వారి రేపటి సంసారపు జీవితానికి ప్ర్రాధమిక పాఠశాల అన్నమాట.
   ** ఈ గుజ్జనగూళ్ళ ఆటను రుక్మిణియు, గరికయు ఆడినట్లు భగవతమునందును, వసు చరిత్రయందు వర్ణీతమైనది.
                             బొమ్మల పెళ్ళిళ్ళు
          పిల్లలు తాటాకులతో ముఖము, చేతులు, పొట్ట, కాళ్ళు వచ్చేలా బొమ్మలుచేసి వానిని ఆడ, మగ బొమ్మలుగా విడదీస్తారు.  మగ బొమ్మ

^విజ్ఞాన సర్వస్వం తెలుగు సంసృతి 1 (ఆటలు, వేదుకలు) పు.23

    • తెలుగు విజ్ఞాన సర్వస్వం (తెలుగు సంసృతి) క్రీడలు, పుట. 1442 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ