పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లను పొడుగ్గాను, ఆడబొమ్మలను కొంచెం పొట్టిగానూ చేస్తారు. ఆడబొమ్మలకు కళ్ళకు కాటుక, బుగ్గనచుక్క, కళ్యాణంబొట్టూ పెట్టి చిన్న గుడ్దపీలిక చీరలా సింగారించి తలకు వెనక జడకట్టి చేతులకు గాజులు, మెడలో పూసలపేర్లు వేసి అందంగా సింగారిస్తారు. మగ బొమ్మలకు ముఖాన కళ్యాణంబొట్టు, బుగ్గన చుక్క పెట్టి చిన్నగుడ్దముక్క పంచిలా కట్టి, భుజంపై మరో గుడ్డముక్క ధోవతిలా వేస్తారు. పిల్లలు రెండు జట్లుగా విడి ఒకరు ఆడపెళ్ళివారుగను, ఒకరు మగపెళ్ళీవారుగను ఆ బొమ్మలు తీసుకొని ఇళ్ళల్లో తాము చూసి అవగాహన చేసుకున్న పెండ్లి తంతులన్నీ నడుపుతూ ఆ బొమ్మలకు పెండ్లిచేస్తారు. ఈ పిల్లల్లో ఒకరు బ్రాహ్మణవేషం వేసుకుని పెళ్ళి మంత్రాలు "ఆశింతాయనమ:, బుసింతాయనమ:" అంటూ అక్షతలు జల్లుతూ పెండ్లి జరిపిస్తారు. కట్నాలు, కానుకలు, చదివింపులు యివి ముఖ్యంగా అనుకరిస్తారు.

ఈ ఆట చిన్నపిల్లలకి లోక వ్యహారాలు అవగాహనఛేసుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులో పిల్లలు పొందే ఆనందం అనిర్వచనీయం.

  *తెలుగుభారతంలో ఉత్తర తన బొమ్మల పొత్తికలకు చిత్రవర్ణమైన భాసురములైన కొరవవీరులకోకలను తెమ్మని అర్జునునకు చెబుతుంది.
    **"బొమ్మరిండ్లు కట్టి..........బొమ్మలుచేసి పెండ్లి" అనె విషయం నన్నెచోడుని కుమారసంభవంలోకూడా ఉంది.

                  "బొమ్మల పెండ్లిడ్లు ఋవ్వంపు బంతులు
                    పుణికిళ్ళు నిట్టేక్కి బొమ్మ రిండ్లు"
    అని 150 ఏండ్ల క్రిందట నారాయణకవి ( 5-143) వ్రాసినాడు.
                   

                               నూ క లా ట
   మరీ పశిపిల్లలు వారిజ్ఞానపరిధిలో సంభాషణాత్మకంగా ఆడుకునే శ్రమలేని చిన్ని ఆటయిది.  ఒకర్ని మరొకరు -

                     "నూకలిస్తా మేకల్ని కాస్తావా?" అంటారు.
                     "కాస్తాను" అని రెండవారి సమాధానం.

  • శ్రీ మదాంధ్ర మహాభారతం. విరాటపర్వం. 4వ అశ్వాసం 47వ పద్యం.
    • కుమార సంభవం. ఆ. 3 వ పద్యం. 38