పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమెగురించి ఇతరులుచెప్పినమాటలనుబట్టిగాని ఆమె ఆదినుండీ భక్తి తర్పరతగలిగిన వనితగా ఎక్కడా కానరావడంలేద్. కాకపోతే వేశ్యా వృత్తిమీద అప్పుడప్పుడు అపక్యాతగుతున్నవేశ్యగామాత్రం కనబడుతుంది.

  ఇలా అసహ్యించుకోవడం "భక్తురాలుగనుక" అని భావించడం హేతు బద్దంకాదు.  సానివృత్తి ఆమెకు యిష్టంలేదనీ, సంసారిగాబ్రతకాలనీ అంతరాంతరాల్లో ఆమె మనస్సు కోరుతోందనీ మాత్రం ఎవరయినా అంటే ఒప్పుకోగలం.  ఇంతేకాదు -శ్రీహరి భవానీని బయటకుత్రోలివేయమని చెప్పినప్పుడు చింతామణి "అంతసొమ్ముపెట్టినవానిని ఇంతలోనే ఆవలకుకొట్టలేక చూచుదున్నానమ్మా" అని చెప్పేమాటలవల్ల ఆమెలోని మావవత్వం మనకు కనిపిస్తుంది.  కాని అది దైవభక్తికాదు.  ఒకవేళ ఆమె భక్తురాలే అయితే అసలామె వ్యభిచారం అనే నీచపుపని చెయ్యనేచెయ్యదు.  అలాచేస్తూ భక్తిగీతాలుపాడుతూవుంటే అది దొంగభక్తే అవుతుందిగాని నిజమైన భక్తి అనిపించుకోదు.
     అయితే ఈమె ఆఖరున హఠాత్తుగా భక్తురాలుగామారుట ఎలా సంభవమనేది ప్రశ్న.  విజ్ఞలైనవారు ఏదోఒకసంఘటనమూలంగా చకితులై అలామారిన ఉదంతాలు లేకపోలేదు.  ప్రాచీనకాలంలో వేమన, అర్వాచీనకాలంలో చలం యిలా మారినవారే.  ఈమెనుకూడా ఆ కోవలోకి చేర్చడంలోతప్పులేదు.  కారణం ఈమెకూడా ఉద్దండపండితురాలుగనుక. అయితే ఈమెలో ఈమార్పు రావడానికి యీనాటకంలో చూచిన కృష్ణాష్ఠమినాడు ఏప్రేరణాలేకుండానే కృష్ణభక్తిలో పడిపోయినట్లు చెప్పడం అర్ధవంతంకాదు.  కలలోశ్రీకృష్ణుడు కనపడి ఆమెను మార్చి వేసేడంటే అది వేరే విషయం. ఆమె పూర్వజన్మవాసనవల్ల అలామరిపోయిందని  అలౌకికవాదంచేస్తే వారికి ఇక చెప్పేదేమీలేదు.  కాని హృదయమున్న మనిషిమారడానికి ఈకృత్రిమపద్దతి ఏమీఅక్కరలేదు.  తనమీదమమకారంతో గాలివానలోతడిసిపోయి, రక్తపుమరకలతో హోరుగాలిలో తండ్రిశవాన్ని విడిచి,భార్యశవాన్ని తెప్పగాజేసికొని ఏరుదాటి వచ్చినప్రియుణ్ణిచూసినప్పుడు ఇంతటిదరుణానికి ఘోరపతనానికి ఇంతటి భీభత్సానికి తానేకదా కారణమనే భావనవస్తే అది మనవత్వం గల ఆమెహృదయాన్ని కలచివేసి, నిలువునాదహించివేసి నిజంగా విరాగినిచేస్తుంది.  ఇలాచూపిస్తే వాస్తవికఫోకడకూడా అవుతుంది.