పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనస్తత్వాన్ని తెలుపుతుంది. అంతేగాకుండా ద్వితీయాంకంలో చిత్ర లోపలినుండివచ్చి వెకిలినవ్వుతో "మాయక్క పక్కన్నుంచుంటే మా బావగారిమొహానికెంతెలుగొచ్చిందో?" అనేమాట అపరిపక్వస్థితిని తెలుపుతుంది.

    ఆడువారివిషయంలో అదిగీ ఎదగని వయస్సు అంటే 12-15 సంవత్సరముల మధ్యనే.  ఇలాంటివేషానికి 10 ఏండ్లుకూడా పూర్తిగారాని పసిపిల్లనో, లేక పాతికేండ్లుదాటిన మధ్యవయసుమనిషినో ఎన్నుకొనడం ఔచిత్యంలేనిపని.
    చింతామణి స్వగతంలోని మాటలవల్ల చివరికి చిత్రఎవరో మనకు స్పష్టంగా తెలుస్తోంది.  "పాపము - పూలదండకిది యెంత మొగము వాచియున్నదో! భగవంతుదేమి పాపముచేసినకన్నెలకు పుడుపుగత్తెల యింటదాస్యమును, కోడరికము ప్రాప్తింపచేయునోగాని.

గీ|| "సానికిని జారులకు మితిలేని సేవ
      కూరయును, నారయులేని - కూడు హాని
      కట్టి చింపిన పట్టము - కటిక నేల
      పడక నిలువెల్ల కోతలు - వాతలు గద"

   అంటుంది చింతామణి, దీనినిబట్టి చిత్ర యింటికోడలయినాకావాలి, లేదా దాసియైనకావాలి.  కోడ్లుకాదుగనుక దాసీపిల్లాని నిర్ధారణగా తేలుతోంది. ఇప్పుడయినా యీమ ఆహార్యమెలావుండాలనేది గ్రహించాలి యీమెచేత టెరికాట్  బెర్లిన్ చీరలుకట్టించే సమాజాలు.
                 చింతామణి దైవభక్తురాలా?
      చింతామణి మొదటినుండీ దైవభక్తురాలనీ, కాబట్టే చివర విరాగిని అయిపోయిందనీ కొందరు అంటుండడం వింటుంటాం.  అలాభవించిన కొందరునటీమణులు  ఈ పాత్ర్ ప్రవేశందగ్గరనుంచీ వీలుదొరికినప్పుడల్లా మీరాబాయిలా భక్తిగీరాలు దంచేస్తుంటే ఈమె నిజంగా ఆదినుండీభక్తు రాలేమో అనేభావం కలుగుతుంది.  కాని కవి ఈమె తొలుతనుండి కృష్ణభక్తురాలని ఎక్కడాచెప్పలేదు.  కవివ్రాసిన ఆమెమాటలనుబట్టికాని,