పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతే అది పోతుంది. తలనొప్పికి ఆముదం ఆకుగానీ, నిమ్మ ఆకుగుండకొట్తిగానీ తలపై కడతారు. నొసలుకు మంచిగంధంగానీ, మిరియాలు ఉడికించిగానీ పట్టువేస్తారు-కొదీనాపప్పు, హారితికర్పూరం కలిపి నుదుటికి రాస్తారు. ఇది వేడిని తగ్గించేస్తుంది. తలనొప్పికి నల్లినిచంపి వాసనచూస్తే కూడా పోతుండంటారు. శొంఠి కణతలకు రాసినా తలనొప్పిపోతుంది. పార్శ్వపునొప్పికి కుంకుడుకాయ నురుగు కొద్దిగా వెచ్చచేసి రెండుముక్కుల్లోనూ వేస్తారు. కొందరు ముషినిచెక్కగంధం 3 సార్లు త్రాగిస్తారు.

చెవిలో పోటుకు రుద్రజడాకు పసరు పిండుతారు. కొంద్రు నిమ్మరసం గవ్వహిదుం పొంగించి చెవిలోపోస్తారు. గాలిబిళ్ళలు వేస్తే అవిసాకు రుబ్బి ఆ పసరు కొబ్బరినూనెలోగాని, సున్నంలోగాని కలిపి వాటికి పూస్తారు. వేడిచేసి కళ్ళు మండుతుంటే చనుబాలు పిండమంటారు లేదా నందివర్థనంపూలు కట్టమంటారు. కండ్లకలకకు నువ్వుల నూనెగాని, నీరుల్లిపాయరసం గాని కండ్లలో వేస్తారు. కామెర్లకు నేలఉసిరి ఆకుల్నికాయలతో సహా పసరుతీసి మజ్జిగతో కలిపి పరగడుపున త్రాగిస్తారు. ఎక్కువమందిచెప్పే వైద్యంకుంకుడుకాయ మూడుసార్లు పాలతో సానపై అరగదీసి గ్లాసెడుపాలలో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకుంటే మూడు రోజుల్లో తగ్గిపోతుందని. దీనికి మరోగ్యారంటీ పసరు వైద్యం కూడా వుంది. తూర్పుగోదావరిజిల్లాలోని వెల్లగ్రామంలో యిది ప్రతి ఆదివారం యిస్తారు అతిచౌకగా. దీనికి దేశప్రసిద్ధివుంది. జానపదుల్లో కొందరు కామెర్లరోగిని సూర్యోదయం ఎండలోనిలిపి సూర్యునివైపుచూస్తూ గడ్డిపరకలతో మంత్రించి మాండోరం (నేటివ్ మందు) ముందుగా యిస్తారు తేనెలోవేసినాకమని, దీనికి తగ్గిపోవడంఉంది. తూ|| గో|| కొంకుదురులో తాడి రామన్నగారు, అనంతరం వారి మనుమదు తాడి వెంకటకృష్ణారెడ్డిగారు యీ మంత్రం వేసి తగ్గించేవారు. ఈ మంత్రంలో ముందు రోగిని కామెర్లొచ్చిందా అని అడుగుతారు. కామెర్లొచ్చిందంటాడురోగి. ఇలా మూడుసార్లు ప్రశ్నించి పదవులు కదుపుతూ నోటిలో ఆ జబ్బు తగ్గించమని సూర్యదేవుని ప్రార్థిస్తాడు. ఇంతకీ యీ తగ్గడం మాండోరం ప్రభావమే అంటారు.

నోటికి పూతపూస్తే పటిక రయిస్తారు లేదా పుల్లటి మజ్జిగ పుక్కిట పట్టమంటారు. ఇగుళ్ళూ రక్తంకారుతుంటే (పయోరియా) నేపాళంపుల్లతో పండ్లు తోమమంటారు. పళ్ల సలుపులకు నీళ్లలో జామిఆకులు వేసి బాగా