పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైద్యం:

  • Folk medicine is the substance of all the traditional view points on sickness and the healing methods applied against disease which exist among the people".

జానపదులవైద్యం వారికి అనుభవం నేర్పిన విద్య. తమ పూర్వుల నుండి అందుకోబడిన నిధి.

ఇంగ్లీషు వైద్యం రాకముందు పల్లెసీమల్లో ఆయుర్వేద వైద్యం ప్రసిద్ధిగాసాగింది. దీనికి ఆద్యుడు ' ధన్వంతరి '.'చరకసంహిత ' ప్రమాణగ్రంధం. దీనిలో పేరెన్నికగన్న వైద్యులకు మెడల్స్ యిచ్చి బిరుదు లిచ్చి పల్లకీలమీదకూడా ఊరేగించేవారు. ఆ రోజుల్లొ రాజవైద్యులుకూడా వీరే. ఇప్పటికి కూడా అల్లోపతి వైద్యానికి లొంగని దీర్ఘ రోగాలకూ, మొండి వ్యాధులకూ ఇదే శరణ్యం. తరువాత జర్మనీనుండి దిగుమతి కాబడిన హోమియో వైద్యంకూడా బాగా ప్రచారం పొందింది.

వీటికన్నిటికీముందు సమాజానికి గొప్పసేవచేసింది జానపదుల అనుభవవైధ్యం. ఇది నాటువైద్యమనీ, గచ్చాకు పుచ్చాకు వైద్యమనీ కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. నాడిచూసి రోగం నిర్ణయించే ప్రక్రియ జానపదుల సొత్తు. వీరు చేయిపట్టుకొని నాడిచూసి వాతం, పిత్తం, శ్లేష్మం వగిఅరాల హెచ్చు తగ్గులు గమనించి మందులిస్తారు. ఈ మందు కూడా అతితేలికగా లభ్యమయ్యేదే. చాలావరకు చిట్కావైద్యమే. ఉదాహరణకి తేలుకుట్టింది అనుకోండి. వెంటనే చింతపిక్క అరగదీసి కుట్టితినచోట అంటిస్తే టక్కున అతుక్కుపోతుంది. పది నిమిషాలలో ఆ విషాన్నంతా పీల్చుకొని ఆ పిక్క ఊడిపోతుంది. దానితో బాధకూడ పోతుంది. దెబ్బతగిలి రక్తం కారుతుంటే దానిపై ముగ్గువేసి కిరసనాయిలు పోస్తారు. వెంటనే రక్తం కట్టడిపోతుంది. గుడ్డ కాల్చి ఆమసి అంటిస్తారు - దెబ్బ మాడిపోతుంది.


  • Oswald A.Erich and Richard Beifle, as quoted in Folklore Folk life 1972 P.193, 194 ("ఆంద్రుల జానపద విజ్ఞానము" నుండి గ్రహించబడినది)