జానపదుల నిసర్గ విజ్ఞాన నిధి
జానపదులయొక్క సహజ విజ్ఞాన నిధి పరంపరానుగతమైనది. శతాబ్ధాల తరబడి వారసత్వముగా ఒకరినుండి మరియొకరికి సంక్రమిస్తూ ప్రవహిస్తున్న నజీవ స్రవంది. ఇది వారి విద్య, వైద్యం, ఆహారం, విహారం, వ్యవహారం మొదలైన రంగాలలో విశేషంగా కనిపిస్తుంది.
విద్య:
వీరిని చాలవరకు నానాకాలం చదువులు, పల్లెజనులు సేద్యం వృత్తిగా గల రైతులు, రైతుకూలీలు. వీరికి సంవత్సరంలో వానాకాలం తీరిక. ఊడ్పులు పూర్తయి మరల పంట కోతకొచ్చే వరకూ పనిపాటులుండవు. ఇఒదే వర్షఋతువు ఈ సమయంలో వీధుల్లో అరుగులమీద పాఠశాలలు నిర్వహించే పంతుళ్ళవద్ద ఓనమాలు ప్రారంభించి [ఓ, న,మ:, శి,వస,య:] శతకాలూ, పద్యాలూ కంఠస్థం చేస్తూ, పొలాల్లో స్వేచ్చగా గొంతెత్తి పాడుతూ శృతిలయలు తమంతతాముగా తమ్మువరించేటట్టు చేసుకుంటారు. సంగీత సాహిత్యాలు ఇలా వారి రక్తనాళాలలో ప్రవేశిఒస్తాయి. పెద్ద బాలశిక్ష వీరి పారాయణ గ్రంధం. భారత, భాగవతాది పురానేతి హాసాలు వింటూ, వానిలోని నీతులను జీర్ణీంచుకుంటూ వానిని తమ నిత్యజీవితాల మీదికి అనువర్తింప చేసుమొనేవారు. రాముడులాటి కొడుకుఇ, సీతలాంటి కూతురు వారు మనసారా కోదుకొనేది. "యద్బావ్యం తద్భవతి" అన్నట్లుగా తల్లి కనుసన్నలలో మెలిగే కూతుళ్ళూ, తండ్రి అదుపాజ్ఞలలో మెలగే కొడుకులూ వారిసంతానం. వృతులలో తండ్రి వృత్తే కొడుకు స్వీకరించేవాడు. సర్వులకూ వృత్తి విదలు శిరోధార్యం. కర్షకునిబిడ్డలు కర్షకులేఅయి చెమటోడ్చి పనిచేసి ధాన్యరాసులు పండించి అన్నదతలై అందరినీ ఆదుకొనేవారు. కమ్మరి, కుమ్మరి, కరణం, కంసాలి, సాలె, పురోహిత వృత్తులవరు తమ పిల్లలను తమ వృత్తులలోనే ప్రవీణులుగా, ప్రజ్ఞావంతులుగా తీర్చి దిద్దేవారు. "కులవిద్యకు సాటిరదు గువ్వల చెన్నా" అనేది వారి నరనరాలలో నాటుకుపోయిన మాట. అందువల్ల వారికి నిరుద్యోగసమస్య అనేది లేదు. ఇద్ విద్య విషయకంగా వారి విజ్ఞానసిరి.