పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీరు బుడబుక్కలజాతి పుట్టుపూర్వోత్తరాలూ, వాళ్ళ వేషభాషలూ, అలవాట్లూ అదోప్రత్యేకమైన మాండలికంగా మాట్లాడుతూ మధ్యమధ్య చిన్న చిన్న హాస్యంచెణుకులు వదుల్తుంటే చూడ్డానిక్, వినడానికీ అదో చిత్రంగా ఉంటుంది.

   'మావూరిచివర తొంబైఏండ్ల బాలాకుమారీవుంది.  అక్కడ చాలా చిత్రాలూ జరుగుతున్నాయ్ మహారాజ్ -ఏమి చిత్రాలురారామజోగీ అనేరు.  పాములు కప్పల్నీమింగు, పిల్లులు ఎలకల్ని కరచు, బెల్లానికి చీమలూపట్టు '
    "ఈ ఊళ్ళో ఓగాలీతిరుగుతోందీ మహరాజ్ - దాన్నీ ఒదిలిస్తా - మీదీ సొమ్మూ మాకూ వద్దు - తెల్లని గుడ్లుపెట్టే నల్లని కోడిపెట్టల్ నాల్గూ యియ్యిచాల్".
   "ఈమధ్య అయ్యగారిమీదా పగబట్టిఉన్నాడ్. వాడూ మీడీ గుడ్లవాడూ మిట్టనొసలవాడూ. నిశీరాత్రిలేచీ నిక్కీనిక్కెచూసి తనావారీతో కూడుకొనీ తమయింట్కి కన్నంవేస్తండూ. వాడూ ఎవడుగా అని అడిగారూ అయ్యగార్ ? వాడే మహరాజ్ - గాదీకిందా ఎలకా - పందీకొక్కూ మహారాజ్.  ఇలా నవ్వించే జోకులు ఎన్నో!.
                    లం బా డీ వే షం
      అద్దాలుకుట్టిన పరికిణీ జాకెట్టూ ధరించి చేతులకూ భుజాలకూ తెల్ల దంతపు మురుగులూ చెవులకు దంతపు జూకాలూ, వేళ్ళాడే రెండు జడలతో అయిదారుగురు లబాడీస్త్రీలవేషాలతో వస్తుంటే ఏదో లంబాడీతండా ఊళ్ళో కొచ్చిందేమోఅన్నంత అనుమానం కలుగుతుంది.  వాళ్ళ తండాలు ఎక్కడేక్కడ ఉన్నాయో వాళ్ళ ఆచార వ్యవహారాలూ పద్దతులూ చెబుతూ వాళ్ళల్లో అన్న చనిపోతే అతని పెళ్ళన్ని తమ్ముడు పెళ్ళీచెసుకుంటాడనీ, తాము వాలి సుగ్రీవుల వంశం వాళ్ళమనీ, వాళ్ళలో ఒకామెను చూపుతూ యీ లంబాడీ స్త్రీ తనభర్త అడవిలో చనిపోతే మరిదిని పెళ్ళీచేసుకున్నదనీ మొన్న పెళ్ళీ, నిన్న శోభనంఅ, యియ్యాల పొట్టా - ఈ పొట్టామీదా ఒకేపిల్లా ఉందో, రెండూ పిల్లా ఉందో, మూడూ పిల్లా ఉందో సూపించుకోడాన్కీ ఎల్తున్నాం మంత్రసానీ జాడా కోసం" అని పొట్ట ఎత్తి చూపిస్తుంటే అందరూ నవ్వుతారు.  ఇలా వాళ్ళ ఆచార వ్యవహారాలు చెబుతూ వాళ్లు నవ్వకుండా మనల్ని నవ్విస్తూ గొప్ప వినోదం కలిగిస్తారు.